అమ్మో చిరుత..!

ABN , First Publish Date - 2022-05-24T07:15:03+05:30 IST

ప్రత్తిపాడు మండలం ఒమ్మం గి, శరభవరం, పొ దురుపాక గ్రామా ల సరిహద్దు పంట పొలాల్లో చిరుతపులి సంచరిస్తున్న ట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడివయస్సులో ఉన్న చిరుత ఈ గ్రామ పొలిమేరల్లో కలియ తిరుగుతున్నట్లు వారు చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిరుతపులి రెండు గేదెలను కూడా చంపినట్లు సమాచారం.

అమ్మో చిరుత..!

  • ప్రత్తిపాడు మండలంలో చిరుతపులి సంచారం.. ఆందోళనలో రైతులు

ప్రత్తిపాడు, మే 23: ప్రత్తిపాడు మండలం ఒమ్మం గి, శరభవరం, పొ దురుపాక గ్రామా ల సరిహద్దు పంట పొలాల్లో చిరుతపులి సంచరిస్తున్న ట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడివయస్సులో ఉన్న చిరుత ఈ గ్రామ పొలిమేరల్లో కలియ తిరుగుతున్నట్లు వారు చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిరుతపులి రెండు గేదెలను కూడా చంపినట్లు సమాచారం. శరభవరం, ఒమ్మంగి గ్రామాల మధ్య గల రేకుల షెడ్ల వద్ద ఒక గేదెను హతమార్చినట్లు శరభవరం గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఈ మూడు గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తున్న సమాచారంపై రైతులు, ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పొలాల్లో తిరిగేందుకు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫారెస్ట్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రెండురోజులుగా ఒమ్మంగి, శరభవరం మధ్య ఉన్న గడ్డవాగులో నీరు తాగేందుకు చిరుత వచ్చిందని ఆయా గ్రామాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై ఏలేశ్వరం ఫారెస్ట్‌ రేంజ్‌ శ్రీనివాసును వివరణ కోరగా చిరుత సంచారంపై కచ్చితమైన ఆధారాలు లభించలేదని, దీనిపై తమ సిబ్బంది పరిశీలిస్తున్నారని తెలిపారు.

Updated Date - 2022-05-24T07:15:03+05:30 IST