Cheetah: బోనులో చిక్కిన చిరుత...

ABN , First Publish Date - 2022-08-31T18:38:17+05:30 IST

కొప్పళ జిల్లా పరిధిలోని అంజనాద్రి బెట్టపై దేవాలయం పరిసర ప్రాంతాల్లో చిరుత(Cheetah) సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఒక్కసారిగా దేవాలయం

Cheetah: బోనులో చిక్కిన చిరుత...

బళ్లారి(బెంగళూరు): కొప్పళ జిల్లా పరిధిలోని అంజనాద్రి బెట్టపై దేవాలయం పరిసర ప్రాంతాల్లో చిరుత(Cheetah) సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఒక్కసారిగా దేవాలయం పాలక మండలి అప్రమత్తమయ్యింది. దేవాలయం అటవీ పరిధిలో అటవీశాఖ అధికారులు సూచన మేరకు ఆంజనేయ స్వామి(Anjaneya Swami) దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రతా దృష్ట్యా చర్యలు చేపట్టారు. కొండపైకి ఎక్కాలంటే సుమారు 480 అడుగుల ఎత్తులో ఉన్న ఆంజనేయ స్వామి దర్శనం భక్తులకు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు ఆవకాశం కల్పించారు. అంజనాద్రి బెట్టపై ఫొటోలు తీసుకోవడాన్ని దేవాలయం పాలక మండలి నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. చిరుతను పట్టుకోవడానికి అక్కడక్కడ అటవీ శాఖ అధికారులు(Forest Department officials) బోనులు ఏర్పాటు చేశారు. సోమవరం సాయంత్రం జయనగర సిద్దిగేరి రోడ్డులో జనవసతి కలిగిన ప్రాంతంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బొనులో చిరుత పడింది. ఇదే ప్రాం తంలో చాలా రోజుల నుంచి చిరుత సంచరిస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు ఇక్కడే బోను ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-08-31T18:38:17+05:30 IST