చీజ్‌ బాల్స్‌

ABN , First Publish Date - 2022-02-19T18:24:31+05:30 IST

బంగాళదుంపలు - మూడు, చీజ్‌ - అర కప్పు, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, జీలకర్ర పొడి - అర టీస్పూన్‌, గరంమసాల - చిటికెడు, కొత్తిమీర - ఒక కట్ట, శనగపిండి - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా.

చీజ్‌ బాల్స్‌

కావలసినవి: బంగాళదుంపలు - మూడు, చీజ్‌ - అర కప్పు, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, జీలకర్ర పొడి - అర టీస్పూన్‌, గరంమసాల - చిటికెడు, కొత్తిమీర - ఒక కట్ట, శనగపిండి - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా. 


తయారీ విధానం: ముందుగా బంగాళదుంపలను ఉడికించుకోవాలి. తరువాత పొట్టు తీసి ఒక బౌల్‌లోకి మార్చుకుని గుజ్జుగా చేసుకోవాలి. తరువాత అందులో మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాల, కొత్తిమీర, శనగపిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చీజ్‌ వేసి, తగినంత ఉప్పు వేసి మళ్లీ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్‌లా తయారుచేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక చీజ్‌ బాల్స్‌ వేసి వేయించుకోవాలి. ఒకవేళ బాల్స్‌ నూనెలో వేయగానే విరిగిపోతున్నట్లయితే ఇంకాస్త శనగపిండి కలుపుకోవాలి.  ఈ చీజ్‌ బాల్స్‌ను టొమాటో కెచప్‌తో లేదా పుదీన చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.


Updated Date - 2022-02-19T18:24:31+05:30 IST