నిరాడంబరంగా చెన్నయ్య రథోత్సవం

ABN , First Publish Date - 2021-05-06T06:20:19+05:30 IST

మార్కాపురం పట్టణం లోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.

నిరాడంబరంగా చెన్నయ్య రథోత్సవం
చెన్నయ్య రథోత్సవం కొలువుదీరిన స్వామి, అమ్మవారు

మార్కాపురం (వన్‌టౌన్‌), మే 5: మార్కాపురం పట్టణం లోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం రాత్రి స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. కరోనా కారణంగా భక్తులెవ్వరిని అనుమతించకుండా ఏకాంతంగా కార్యక్రమం చేపట్టారు. అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఉత్సవ మూర్తులకు విశేష అలం కరణలు చేశారు. అనంతరం రథంపై ఆలయ ప్రాం గణంలో చెన్నకేశవస్వామిని ఊరేగించారు. ఈవో ఈదుల చెన్నకేశరెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు.

త్రిపురాంతకం ఆలయాల్లో దర్శనం వేళల కుదింపు

త్రిపురాంతకం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో దర్శన వేళలను కుదించినట్లు అధికారులు తెలిపారు. కరోనా సెకెండ్‌ వేవ్‌ వేగంగా వ్యా ప్తి చెందుతున్న నేపథ్యంలో ఉ న్నతాధికారుల ఆదేశాలతో ఉదయం 7 నుంచి మధ్యా హ్నం 11.30 వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు.  


Updated Date - 2021-05-06T06:20:19+05:30 IST