Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పచ్చిబఠాణీ చీలా

పచ్చిబఠాణీ చీలా

చీలాతో చిల్‌

దక్షిణాదిలో దోశ ఫేవరేట్‌ బ్రేక్‌ఫాస్ట్‌! అలాగే నార్త్‌ ఇండియన్స్‌కి చీలా ఫేవరేట్‌!  మరి ఎప్పుడూ మన దోశలనే కాకుండా ఈసారి చీలా రుచులను ట్రై  చేయండి. పెసరపప్పు - పాలకూర చీలా, బంగాళదుంప - ఉల్లిపాయతో చేసే చీలా, వెజిటబుల్స్‌ చీలా, పచ్చి బఠాణీ చీలా... ఆ కోవకు చెందినవే. వీటిని రుచిచూస్తే నార్త్‌ ఇండియన్స్‌ టేస్ట్‌ అదుర్స్‌ అనకుండా ఉండలేరు.


కావలసినవి: శనగపిండి - పావు కప్పు, పచ్చి బఠాణీ - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - మూడు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, కొత్తిమీర - ఒకకట్ట, వాము - అర టీస్పూన్‌, సోంపు - పావు టీస్పూన్‌, నువ్వులు - పావు టీస్పూన్‌, కారం - పావు టీస్పూన్‌, గరంమసాల - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా పచ్చిబఠాణీ, వెల్లుల్లి, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీరను మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. ఒక పాత్రలో శనగపిండి తీసుకుని అందులో పచ్చిబఠాణీ పేస్టు, సోంపు, నువ్వులు, వాము, గరంమసాల, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మిశ్రమం రెడీ అయ్యాక స్టవ్‌పై పాన్‌ పెట్టి వేడి అయ్యాక దోశలా పోసుకోవాలి. నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. పుదీనా చట్నీతో తింటే పచ్చిబఠాణీ చీలా రుచిగా ఉంటుంది.

సోయా మంచూరియసోయా మంచూరియసోయా కబాబ్స్‌సోయా కబాబ్స్‌చిల్లీ గోబిచిల్లీ గోబిఆలూ బఠానీ చాట్‌ఆలూ బఠానీ చాట్‌పెసర వడలుపెసర వడలువడలువడలుచీజ్‌ పరోటాచీజ్‌ పరోటాచీజ్‌ నాన్‌చీజ్‌ నాన్‌చీజ్‌ దోశచీజ్‌ దోశచిల్లీ చీజ్‌ టోస్ట్‌చిల్లీ చీజ్‌ టోస్ట్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.