Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 29 Jun 2022 00:11:24 IST

చెర్రీ ఇంట చద్దా

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇటీవలె రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులను వారి కొత్తింట్లో కలిశారు. ఇప్పుడు ఆమిర్‌ఖాన్‌ వంతు. ఆయన మంగళవారం రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులను వారింట్లో కలిసి ఆతిథ్యం అందుకున్నారు. చరణ్‌, ఉపాసన ఆయనతో కలసి సాయంత్రం సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆమిర్‌ఖాన్‌తో దిగిన ఫొటోలను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అయ్యాయి. ఉపాసన ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్ల రైమీ ఫొటోలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘లాల్‌సింగ్‌ చద్దా’ ఆగస్టు 11న విడుదలవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారు. సల్మాన్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌ లాంటి దిగ్గజ నటులతో గడపడం గొప్ప అనుభూతిని మిగిల్చింది అని ఉపాసన పేర్కొన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International