చత్వారానికి చుక్కల మందుతో చెక్‌

ABN , First Publish Date - 2022-05-24T09:00:05+05:30 IST

నాలుగు పదుల వయసు దాటగానే కొందరికి చత్వారం(ప్రెస్బయోపియా) వస్తుంది.

చత్వారానికి చుక్కల మందుతో చెక్‌

‘వ్యూటీ’ ఐ డ్రాప్స్‌కు ఎఫ్‌డీఏ అనుమతి

న్యూఢిల్లీ, ముంబై, మే 23: నాలుగు పదుల వయసు దాటగానే కొందరికి చత్వారం(ప్రెస్బయోపియా) వస్తుంది. పుస్తకాలు చదవడానికి కళ్లజోడు అవసరం అవుతుంది. కానీ చత్వారం బాధితులకు కళ్లజోడు అవసరం లేకుండా చేసే ‘వ్యూటీ’ చుక్కల మందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తాజాగా అనుమతిచ్చింది. ప్రెస్బయోపియా ఉన్నవారు ఈ చుక్కల మందు వేసుకుంటే చాలు 15 నిమిషాల్లో వారు కంప్యూటర్‌ తెరను, ఫోన్‌ తెరను స్పష్టంగా చూడొచ్చని.. పుస్తకాలు, పేపర్‌ నిక్షేపంగా చదవొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కన్ను పనిచేసే తీరును లక్ష్యంగా చేసుకుని ఈ వ్యూటీ చుక్కల మందు పనిచేస్తుందని.. ఈ చుక్కలు వేయగానే అవి కనుపాపలు కుచించుకుపోయేలా చేస్తాయని వైద్యనిపుణులు వివరించారు. ఎఫ్‌డీఏ అనుమతి రావడంతో.. చత్వారం చూపును సరిచేసే తొలి చుక్కల మందుగా (అనుమతి పొందిన) వ్యూటీ చరిత్ర సృష్టించింది. 

Updated Date - 2022-05-24T09:00:05+05:30 IST