లలిత్‌ బాబుకు ‘చెక్‌’ టైటిల్‌

ABN , First Publish Date - 2022-01-24T08:12:11+05:30 IST

తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ ఎమ్‌ఆర్‌ లలిత్‌ బాబు నెల వ్యవధిలోనే మూడో టైటిల్‌ నెగ్గి హ్యాట్రిక్‌ కొట్టాడు. చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన మెరిన్‌బాద్‌

లలిత్‌ బాబుకు ‘చెక్‌’ టైటిల్‌

నెల వ్యవధిలో మూడో ట్రోఫీ

మరియాన్సెకె లాజ్నె (చెక్‌ రిపబ్లిక్‌): తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ ఎమ్‌ఆర్‌ లలిత్‌ బాబు నెల వ్యవధిలోనే మూడో టైటిల్‌ నెగ్గి హ్యాట్రిక్‌ కొట్టాడు. చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన మెరిన్‌బాద్‌ ఓపెన్‌ చెస్‌ ఈవెంట్‌లో విజయవాడకు చెందిన లలిత్‌ చాంపియన్‌గా నిలిచాడు. మొత్తం 9 రౌండ్లకు గాను లలిత్‌ 6.5 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 29 ఏళ్ల లలిత్‌కు ఇది వరుసగా మూడో అంతర్జాతీయ టైటిల్‌. కొన్నిరోజుల క్రితం అతను థాయ్‌లాండ్‌, ఇటలీ టోర్నీల్లో విజేతగా నిలిచాడు. 

Updated Date - 2022-01-24T08:12:11+05:30 IST