కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ తనిఖీ

ABN , First Publish Date - 2020-08-10T10:55:32+05:30 IST

శింగరాయకొండలోని మలి నేని ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను కందుకూరు ఎ మ్మెల్యే..

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ తనిఖీ

 నిర్వహణపై ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం


 కందుకూరు, ఆగస్టు 9: శింగరాయకొండలోని మలి నేని ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను కందుకూరు ఎ మ్మెల్యే మానుగుంట మహీధ ర్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీచేశారు. ‘అయ్యో.. కోవిడ్‌ కేర్‌ కరవా యే..’ శీర్షికన ఆంధ్రజ్యోతి మినీలో శనివారం ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. కేంద్రంలోని భోజనం ప్యా కెట్లను, అందులోని ఆహారాన్ని పరిశీలించారు. బాధితులతో మా ట్లాడారు. భోజనం సరిగా పెట్టడం లేదని, కనీసం టూత్‌ పేస్టు, బ్రష్‌, దుప్పట్లు కూడా ఇవ్వటం లేదని పలువురు బాధితులు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అ క్కడ విధి నిర్వహణలో ఉన్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు చే  తకాకపోతే తప్పుకోండి.. మా మనుషుల్ని పెట్టి వారి గదులలోకి ఆహార ప్యాకెట్లు అం దజేసే ఏర్పాట్లు చేయిస్తాం‘ అని పేర్కొన్నారు. బాధితులు వివరించిన 18 సమస్యలపై జిల్లా కలెక్టరుతో మాట్లాడతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 


5వ విడత బ్లీచింగ్‌ పంపిణీ

నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలకు 25 టన్నుల బ్లీచింగ్‌ పౌడర్‌ని ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి పంపిణీ చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాల య ఆవరణలో పంపిణీ జరిగింది. అత్యంత నాణ ్యమైన బ్లీచింగ్‌ను రూ.9.23 లక్షల వ్య యంతో తెప్పించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-10T10:55:32+05:30 IST