సర్పంచులకు చెక్‌పవర్‌

ABN , First Publish Date - 2021-05-06T06:20:41+05:30 IST

నూతనంగా ఎన్నికైన సర్పంచులకు త్వరలో చెక్‌పవర్‌ అందనుంది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

సర్పంచులకు చెక్‌పవర్‌

 వివరాల అప్‌లోడ్‌కు  ప్రభుత్వం ఆదేశం

చిత్తూరు కలెక్టరేట్‌, మే 5: నూతనంగా ఎన్నికైన సర్పంచులకు త్వరలో చెక్‌పవర్‌ అందనుంది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త సర్పంచుల వివరాలను కాంప్రెహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(సీఎఫ్‌ఎంఎస్‌)లో ఎంపీడీవోల లాగిన్‌ ద్వారా నమోదు చేయాలంటూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సర్పంచులకు ఐడీ, పాస్‌వర్డులు కేటాయించనున్నారు. వీటిని  పంచాయతీకార్యదర్శులు ఇది వరకే సిద్ధం చేసి ఉంచారు. ఆయా ఎంపీడీవోలు సర్పంచుల వివరాలను లాగిన్‌లో నమోదు చేసి వీలైనంత త్వరగా ఖజానాశాఖకు పంపాల్సి ఉంది. మరో వారం రోజుల్లో ఐడీ, పాస్‌వర్డులు వస్తే సర్పంచులకు చెక్‌ డ్రా పవర్‌ వచ్చేసినట్లే.



Updated Date - 2021-05-06T06:20:41+05:30 IST