Gold Rate Today: బంగారం ధర బాగానే పెరిగిందిగా.. తులం బంగారం ధర ఎంత ఉందంటే..

ABN , First Publish Date - 2022-05-29T13:24:33+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర..

Gold Rate Today: బంగారం ధర బాగానే పెరిగిందిగా.. తులం బంగారం ధర ఎంత ఉందంటే..

బంగారం ధర ఆదివారం (మే 29, 2022) స్థిరంగా ఉన్నప్పటికీ గత పది రోజులుగా గోల్డ్ రేట్స్‌ను పరిశీలిస్తే మాత్రం భారీగానే పెరిగిందని చెప్పక తప్పదు. మే 19న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46,300 ఉండగా, మే 29కి ఈ ధర రూ.47,750కి చేరుకుంది. అంటే.. పది రోజుల వ్యవధిలో 1,450 రూపాయలు పెరిగింది. అదే విధంగా మే 19న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50,510 రూపాయలు ఉండగా మే 29 నాటికి 52,090 రూపాయలకు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా పది రోజుల్లో పది గ్రాములపై 1,580 రూపాయలు పెరిగిందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పెళ్లి ముహూర్తాల కారణంగా బంగారానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఎంత ధర పెరిగినా వినియోగదారులు కొనేందుకు మొగ్గు చూపక తప్పని పరిస్థితి నెలకొంది. శనివారానికి, ఆదివారానికి బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి.



తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,090గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 పలుకుతుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,090గా ఉంది. ఇక.. దేశంలోనే బంగారం ధర అత్యధికంగా ఉన్న నగరాల్లో జైపూర్, లక్నో, చండీగర్ ఉన్నాయి. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 పలుకుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర 52,240 రూపాయలుగా ఉండటం గమనార్హం.



దేశ రాజధాని ఢిల్లీలో, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,090గా ఉంది. ఇక.. వెండి ధరలను పరిశీలిస్తే.. శనివారం (మే 28) రోజు కిలో వెండి ధర రూ.62,150గా ఉండగా ఆదివారానికి ఈ ధర రూ.62,200కి చేరుకుంది. కిలో వెండిపై 50 రూపాయలు పెరిగింది. హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో వెండి ధర మోత మోగుతోంది. కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.67,000 పలుకుతుండటం గమనార్హం. విజయవాడలో కూడా ఇదే ధర ఉంది. ముంబై, ఢిల్లీతో పాటు దేశంలోని మరికొన్ని నగరాల్లో కిలో వెండి ధర రూ.62,200గా ఉంది.

Updated Date - 2022-05-29T13:24:33+05:30 IST