ఒత్తిడికి ఇలా చెక్‌!

ABN , First Publish Date - 2021-07-18T06:13:38+05:30 IST

వ్యాయామం ఒత్తిడిని దూరం చేస్తుంది. వ్యాయామం చేయడం వల్ల స్ట్రెస్‌ హార్మోన్‌ అయిన కార్టిసాల్‌ స్థాయిలు తగ్గుతాయి.

ఒత్తిడికి ఇలా చెక్‌!

ఒత్తిడి, ఆందోళన... ఈ రెండూ ఇబ్బంది పెట్టేవే. అయితే వీటి బారినపడకుండా ఉండాలంటే ఇదిగో ఇలా చేయండి.

వ్యాయామం ఒత్తిడిని దూరం చేస్తుంది. వ్యాయామం చేయడం వల్ల స్ట్రెస్‌ హార్మోన్‌ అయిన  కార్టిసాల్‌ స్థాయిలు తగ్గుతాయి. నిద్ర తక్కువైతే ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. వ్యాయామం వల్ల శరీరం అలసిపోయు మంచి నిద్ర పడుతుంది. అంతేకాకుండా వ్యాయామంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

రోమా ఆయిల్స్‌, సువాసన ఇచ్చే క్యాండిల్స్‌ వెలిగించడం వల్ల ఒత్తిడి దూరం చేసుకోవచ్చు. లావెండర్‌, రోజ్‌, సాండల్‌వుడ్‌, నెరొలి, చమోలి వంటి సెంట్లను ఉపయోగించవచ్చు.

మీలో ఒత్తిడికి కారణమవుతున్న అంశాలను పేపర్‌పై రాయండి. ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. 

కుటుంబసభ్యులతో, స్నేహితులతో సరదాగా గడపండి. సాయంకాలం వేళల్లో పిల్లలతో కాసేపు పార్కులో సేదతీరండి. 

ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు బిగ్గరగా నవ్వండి. నవ్వు మీ ఆందోళనను తగ్గిస్తుంది. ఇమ్యూన్‌ సిస్టమ్‌ను ప్రేరేపిస్తుంది.

 యోగా, బ్రీతింగ్‌ వ్యాయామాలు ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. ఎప్పుడో ఒకసారి కాకుండా రోజూ అలవాటుగా చేసుకుంటే ఫలితం ఉంటుంది.

Updated Date - 2021-07-18T06:13:38+05:30 IST