Abn logo
Oct 2 2020 @ 01:20AM

ఎవరెవరికి ‘చెక్‌’

Kaakateeya

‘‘ఎవరు ఎవరికి ఎలా చెక్‌ చెప్పారో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’’ అంటున్నారు నిర్మాత వి ఆనంద ప్రసాద్‌. నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న చిత్రానికి ‘చెక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నాయికలు. గురువారం ఈ చిత్రం టైటిల్‌, ప్రీ లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘నటన పరంగా ఈ చిత్రంలో నితిన్‌ విశ్వరూపం కనిపిస్తుంది. చంద్రశేఖర్‌ యేలేటి మేకింగ్‌ స్టైల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పంథాలోనే ఉంటూ వాణిజ్య అంశాలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఈ నెల 12 నుంచి చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతుంది. నెలాఖరుకు షూటింగ్‌ పూర్తవుతుంది’’ అని తెలిపారు. ‘‘చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరి శిక్షపడ్డ ఖైదీ కథ ఇది. నితిన్‌ ఇప్పటి వరకూ చేయని పాత్ర ఇది’’ అని దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement