రీ సర్వేతో భూవివాదాలకు చెక్‌

ABN , First Publish Date - 2022-01-19T05:48:35+05:30 IST

ల్యాండ్‌ రీ సర్వేతో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పాడేరు సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌ అన్నారు.

రీ సర్వేతో భూవివాదాలకు చెక్‌
రీసర్వే మ్యాప్‌ను పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌


సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌

చింతపల్లి, జనవరి 18: ల్యాండ్‌ రీ సర్వేతో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పాడేరు సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌ అన్నారు.మంగళవారం స్థానిక బాలాజీపేటలో శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏజెన్సీలో పైలట్‌ ప్రాజెక్టుగా బాలాజీపేటలో డిజిటల్‌ ల్యాండ్‌ రీ సర్వేను డ్రోన్లు సాయంతో నిర్వహించామన్నారు.  బాలాజీపేటలో పది కుటుంబాలకు చెందిన జిరాయితీ భూమి 31.12 ఎకరాలు వున్నట్టు గుర్తించామన్నారు. ప్రభుత్వ భూమి 12.13 ఎకరాలు, గ్రామ కంఠం 52 సెంట్లు వుందన్నారు. గతంలో నిర్వహించిన సర్వేలో బాలాజీపేటలో 42.99 ఎకరాలు వున్నట్టుగా రికార్డులో నమోదు కాగా.. తాజా సర్వేలో 43.25 ఎకరాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. ప్రతీ రైతుకి ఒక క్యూఆర్‌ కోడ్‌ని కూడా రూపొందించామని,  ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ గోపాలకృష్ణ, డీటీ శ్రీనుబాబు, ఈవోపీఆర్‌డీ శ్రీనివాసరావు, సబ్‌ కలెక్టర్‌ డీఐ బీఎన్‌ఎస్‌ ప్రసాద్‌, సర్వేయర్‌ మోహన్‌రావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-19T05:48:35+05:30 IST