జుట్టురాలే సమస్యకు చెక్ పెట్టాలంటే... ఇంట్లోనే ఇలా చేయండి..

ABN , First Publish Date - 2021-10-07T17:06:29+05:30 IST

జుట్టు రాలే సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఈ సమస్యకు హెయిర్‌మాస్క్‌ చక్కగా పనిచేస్తుంది. అయితే రసాయనాలు ఉపయోగించిన మాస్క్‌ కాకుండా, అరటిపండు, తేనె వంటి సహజ సిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన మాస్క్‌ను ఉపయోగించాలి. ఈ మాస్క్‌ ఎలా తయారుచేసుకోవాలంటే...

జుట్టురాలే సమస్యకు చెక్ పెట్టాలంటే... ఇంట్లోనే ఇలా చేయండి..

ఆంధ్రజ్యోతి(07-10-2021)

జుట్టు రాలే సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఈ సమస్యకు హెయిర్‌మాస్క్‌ చక్కగా పనిచేస్తుంది. అయితే రసాయనాలు ఉపయోగించిన మాస్క్‌ కాకుండా, అరటిపండు, తేనె వంటి సహజ సిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన మాస్క్‌ను ఉపయోగించాలి. ఈ మాస్క్‌ ఎలా తయారుచేసుకోవాలంటే...


ఒక బౌల్‌లో రెండు టేబుల్‌స్పూన్ల తేనె, రెండు టేబుల్‌స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ వేసి కలపాలి. తరువాత చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి పేస్టులా చేసి జుట్టుకు పట్టించాలి. 


రెండు అవొకడో పండ్ల పొట్టు, విత్తనాలు తీసేయాలి. మిగిలిన అవొకడ్‌ ముక్కలు ఒక బౌల్‌లోకి తీసుకుని, కొద్దిగా కొబ్బరి నూనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని జుట్టుకు పట్టించాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్‌ను ఉపయోగించినా ఫలితం ఉంటుంది.

Updated Date - 2021-10-07T17:06:29+05:30 IST