నకిలీ సర్టిఫికెట్లకు చెక్‌ పెట్టాలి

ABN , First Publish Date - 2022-01-25T07:21:49+05:30 IST

నకిలీ సర్టిఫికెట్లను కట్టడి చేయడానికి వీలుగా ప్రవేశపెడుతున్న

నకిలీ సర్టిఫికెట్లకు చెక్‌ పెట్టాలి

  •  డిజిలాకర్‌ వాడకాన్ని బలోపేతం చేయాలి
  •  ఉన్నత విద్యా మండలి భేటీలో అధికారుల నిర్ణయం


హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): నకిలీ సర్టిఫికెట్లను కట్టడి చేయడానికి వీలుగా ప్రవేశపెడుతున్న ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ విధానంపై అధికారుల కసరత్తు చివరి దశకు చేరుకుంది. సర్టిఫికెట్ల డిజిటలైజేషన్‌ కోసం అన్ని విశ్వవిద్యాలయాల్లో డిజిలాకర్‌ వాడకాన్ని బలోపేతం చేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. దీనిపై సోమవారం రాష్ట్ర ఉన్నత విద్యా మం డలి చైర్మన్‌ లింబాద్రి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.


అన్ని రకాల సర్టిఫికెట్లను డిజిటలైజ్‌ చేసి, ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే అంశంపై అధికారులు చర్చించారు. ఈ వ్యవస్థ ఏర్పాటు ద్వారా.. సర్టిఫికెట్లను సులువుగా వెరిఫికేషన్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా బోగస్‌ సర్టిఫికెట్లను ఏరివేయడానికి కూడా సహకరిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా యూనివర్సిటీలకు సూచనలు పంపాలని సమావేశంలో నిర్ణయించారు.


Updated Date - 2022-01-25T07:21:49+05:30 IST