సైబర్‌ స్కామ్‌కి చెక్‌!

ABN , First Publish Date - 2022-06-25T10:29:14+05:30 IST

ఏటీఎం, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు వంటి సదుపాయాలతో బ్యాంకింగ్‌ లావాదేవీలు సులువైన మాట నిజం.

సైబర్‌ స్కామ్‌కి చెక్‌!

టీఎం, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు వంటి సదుపాయాలతో బ్యాంకింగ్‌ లావాదేవీలు సులువైన మాట నిజం. బ్యాంకుల్లో చాంతాడంతో క్యూల నుంచి తప్పించుకున్న మాటా వాస్తవమే. షాపింగ్‌ నుంచి ఇతర పేమెంట్స్‌ వరకు కార్డు జేబులో ఉంటే చాలు, సర్వం సాధ్యమవుతున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ వెసులుబాట్లన్నీ దుర్వినియోగం అవుతున్నాయి. అమాయకంగా ప్రవర్తిస్తే,  చేజేతులా మోసగాళ్ళ వలకు చిక్కాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఒక్క చిన్న తప్పుతో మొత్తం సొమ్ములు కోల్పోతున్న అభాగ్యులు లెక్కకు మించి ఉండటం గమనార్హం. ఇలా మోసపోకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ బ్యాంకులు, సైబర్‌ నిపుణులు, పోలీసులు తరచుగా హెచ్చరిస్తుంటారు. అయినా కూడా కొంతమంది వీటిబారిన పడుతుంటారు. చాలా మందికి తెలిసినవే అయినా ఈ జాగ్రత్తలు తీసుకుంటే బ్యాంకు ఫ్రాడ్‌లకు దూరంగా ఉండవచ్చు. 


ఎప్పటికప్పుడు లేదంటే కనీసం రెండు మూడు నెలలకు ఒకసారి పాస్‌వర్డ్‌ను మారుస్తూ ఉండాలి. అలాగే ఎప్పుడు మార్చినా ఎనిమిది క్యారెక్టర్లతో పటిష్టమైన పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అక్షరాలు, అంకెలు కలగలిపి పాస్‌వర్డ్‌ పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. 

పబ్లిక్‌ కంప్యూటర్లపై నెట్‌ బ్యాంకింగ్‌ వద్దు. పబ్లిక్‌ కంప్యూటర్స్‌ హ్యాకర్ల థ్రెట్స్‌కు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. హ్యాకర్లు సులువుగా సమాచారాన్ని పొందగలుగుతారు. ఇదో గోల్డెన్‌ రూల్‌ అన్నా అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. 

ఆన్‌లైన్‌లో లావాదేవీల విషయంలో వెరిఫై చేసిన యాప్‌లు, వెబ్‌సైట్లను మాత్రమే ‘ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌’కు ఉపయోగించాలి. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ను నమ్మవచ్చు. టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ ఉంటుంది. మూడో లేయర్‌ సెక్యూరిటీ - ఎయిర్‌టెల్‌ సేఫ్‌ పే కారణంగా మీ అనుమతి లేకుండా బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి అమౌంట్‌ డిడక్ట్‌ కాదు.

పబ్లిక్‌ ప్రదేశాల్లో ఉచితంగా లభించే ఇంటర్నెట్‌ సదుపాయాన్ని వాడుకోవద్దు. బ్యాంకింగ్‌ లావాదేవీలకు అది అంత సురక్షితం కాదు. హోమ్‌ వైర్‌లెస్‌ కనెక్షన్‌ అందునా స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌తో మాత్రమే లావాదేవీలు జరపడం మంచిది. 

అనుమానాస్పద లింకులను ఎన్నడూ ఓపెన్‌ చేయకూడదు. మెయిల్స్‌, మెసేజ్‌లతో బ్యాంక్‌ ఉద్యోగులమని చెబుతూ ఒత్తిడి తీసుకువస్తారు. వీరి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్‌ వివరాల చెకింగ్‌, క్యాష్‌బ్యాక్‌ పేరుతో ఓటీపీ వివరం అడగడం, మోసగించడం తరచూ  జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ మాత్రమే సురక్షితం. 

సైబర్‌ అటాక్స్‌ జరుగుతున్న రోజులు ఇవి. పర్సనల్‌ కంప్యూటర్‌లో యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం చాలా మంచిది. అక్కడితో ఆగకూడదు. రెగ్యులర్‌గా అప్‌డేట్‌ చేసుకోవాలి. మాల్వేర్‌ అటాక్‌ల నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 

డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్త్రతగా వ్యవహరించాలి. ఆఫర్ల పేరుతో ఇక్కడే మోసాలు జరుగుతూ ఉంటాయి. కార్డు పోయినపక్షంలో మీ బ్యాంకుకు వెంటనే తెలియజేయాలి. ఎవరికీ మీ కార్డు వివరాలను చెప్పకూడదు. సరైన పోస్‌ మెషీన్ల్‌తోనే కార్డు లావాదేవీలు జరపాలి. 

Updated Date - 2022-06-25T10:29:14+05:30 IST