సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టాలి

ABN , First Publish Date - 2020-06-01T11:17:24+05:30 IST

జిల్లాలో సైబర్‌ నేరాలకు చెక్‌పెట్టాలని ఎస్పీ అమ్మిరెడ్డి పోలీసులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సర్కిల్‌

సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టాలి

ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాల్సిందే

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ స్నేహాలతో మోసపోకూడదు

నేర సమీక్షాసమావేశంలో ఎస్పీ అమ్మిరెడ్డి 


శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, మే 31: జిల్లాలో సైబర్‌ నేరాలకు చెక్‌పెట్టాలని ఎస్పీ అమ్మిరెడ్డి పోలీసులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లతో భౌతికదూరం పాటిస్తూ సైబర్‌నేరాలపై ఆదివారం సమీక్ష నిర్వ హించారు. ఎస్పీ మాట్లాడుతూ, సైబర్‌ నేరాలకు చెక్‌పెట్టే విధంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్‌ క్రైం దర్యాప్తుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేపట్టాల న్నారు. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని చెప్పారు. పెండింగ్‌ కేసులపై ఎస్పీ ఆరా తీశారు. సాకేంతిక పరిజ్ఞానంపై నైపుణ్యం కలిగి ఉండాలని సూచించారు. అప్పుడే దర్యాప్తు వేగం పుంజుకుంటుందని.. మెరుగైన ఫలితాలను సాధించేందుకు వీలుకలుగుతుందని చెప్పారు.


దర్యాప్తు విషయంలో పోలీసు కార్యాలయ టెక్నికల్‌ విభాగ నిపుణుల సూచనలు, సహాయాన్ని తీసుకోవాలన్నారు. నేరాలు సంభవించక ముందే ప్రజలను అప్రమత్తం చేస్తుండాలని సూచించారు. బ్యాంకు లావాదేవీల విషయాల్లో సంబంధిత బ్యాంకుల అధికారులు ఎట్టిపరిస్థితిల్లో ఫోన్‌చేసి సమాచారం సేకరించరన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. జిల్లా విషయా నికొస్తే ఓటీపీ నంబర్లను చెప్పి మోసానికి గురైన కేసులే అధికంగా ఉన్నాయని వివరించారు. ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచిత వ్యక్తుల సహాయాన్ని తీసుకోవద్దని  ప్రజలకు సూచించారు. లాటరీలో గెలుపొందారని, లక్కీ డ్రాలో సెల్‌నంబర్‌కు బంపర్‌ ఆఫర్‌ వచ్చిందని... ఇలా మోస పూరిత ఫోన్‌కాల్స్‌ను, ఎస్‌ఎంఎస్‌లను నమ్మవద్దని చెప్పారు.


ఆన్‌లైన్‌ మార్కెట్‌, ఆన్‌లైన్‌ ద్వారా సెకెండ్‌హ్యాండ్‌ వాహనా ల కొనుగోలు చేసి మోసపోవద్దని ఎస్పీ వివరించారు. నిరుద్యోగులు కూడా సైబర్‌ ఉచ్చులో పడుతున్నారని, ఆన్‌లైన్‌లో ఉద్యోగాలపేరిట ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ స్నేహాల మోజులోపడి మోసపోవద్దని  యువతకు  ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీలు మూర్తి, రారాజుప్రసాద్‌, సత్యనారాయణ, శివరామిరెడ్డి, శ్రీలత, సీఐలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-01T11:17:24+05:30 IST