Advertisement
Advertisement
Abn logo
Advertisement

కప్పు కాఫీతో కరోనాకు చెక్‌

ఆంధ్రజ్యోతి(13-07-2021)

రోజుకో యాపిల్‌తో వైద్యులను దూరంగా ఉంచవచ్చు అనే నానుడి మనకు తెలిసిందే! కరోనా కాలంలో దీన్ని పోలిన మరో నానుడి ప్రచారంలోకి రాబోతోంది. రోజుకో కప్పు కాఫీతో కరోనాను దూరం పెట్టవచ్చు అని ఓ అధ్యయనంలో తేలడమే ఇందుకు కారణం!


రోజుకో కప్పు కాఫీ తాగడం ద్వారా కరోనాతో జబ్బు పడే అవకాశాలు పది శాతం వరకూ తగ్గుతాయని అమెరికాకు చెందిన నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్శిటీ పరిశోధకులు అంటున్నారు. కొవిడ్‌ - 19 తీవ్రతతో సంబంధం కలిగి ఉన్న సిఆర్‌పి, ఇంటర్‌ల్యూకిన్‌-6 మొదలైన బయోమార్కర్లు కాఫీతో కూడా సహసంబంధం కలిగి ఉంటాయనీ, కాఫీ తాగడం మూలంగా ఈ బయోమార్కర్ల ప్రవర్తన అదుపులోకి వస్తుందని ఈ పరిశోధనలో తేలింది. సాధారణంగా కొవిడ్‌ బారిన పడిన పెద్దల్లో న్యుమోనియా తలెత్తే అవకాశాలు ఎక్కువ. 


కాఫీ తాగడం మూలంగా పెద్దల్లో కొవిడ్‌ సంబంధిత న్యుమోనియా తలెత్తే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. దైనందిన జీవితంలో తీసుకునే టీ, కాఫీ, మాంసాహారం, పళ్లు, కూరగాయల ప్రభావాలను పరిశీలించడం కోసం 40 వేల మంది పెద్దల మీద జరిపిన పరిశోధనలో రోజూ క్రమం తప్పక కాఫీ తాగేవారిలో బయోమార్కర్ల స్పందన అనుకూలంగా ఉన్నట్టు రుజువైంది. కాబట్టి ప్రస్తుత కరోనా కాలంలో కాఫీతో కొవిడ్‌కు కొంత మేరకు అడ్డుకట్ట వేయవచ్చని భావించవచ్చు. 

Advertisement
Advertisement