బీపీకి చెక్‌ పెట్టండిలా...

ABN , First Publish Date - 2021-05-26T17:37:23+05:30 IST

ఒక సర్వే ప్రకారం 18 నుంచి 25 ఏళ్ల మధ్య యువతలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. దీనికి కారణం క్రమబద్ధమైన జీవనశైలి లేకపోవడం. చాలామంది బీపీని చిన్న

బీపీకి చెక్‌ పెట్టండిలా...

ఆంధ్రజ్యోతి(26-05-2021)

ఒక సర్వే ప్రకారం 18 నుంచి 25 ఏళ్ల మధ్య యువతలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. దీనికి కారణం క్రమబద్ధమైన జీవనశైలి లేకపోవడం. చాలామంది బీపీని చిన్న సమస్యగా భావిస్తుంటారు. కానీ అలా వదిలేస్తే తరువాత ప్రాణాల మీదకు వస్తుందంటున్నారు వైద్యులు. హైబీపీ లేదా హైపర్‌టెన్షన్‌ను నియంత్రణలో ఉంచుకోవడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు... 


హైబీపీకి వయసుతో సంబంధం, లింగ భేదం లేవు. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1.13 బిలియన్‌ మంది హైపర్‌టెన్షన్‌తో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నలుగురు పురుషుల్లో ఒకరు, ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు దీని బాధితులే. భారత్‌లో అయితే దాదాపు 30 శాతం మంది పెద్దలను హైబీపీ వేధిస్తోంది. 


కొత్తగా హైపర్‌టెన్షన్‌ని గుర్తించిన పేషెంట్లకు దాని నియంత్రణ కోసం ఒక క్రమబద్ధమైన జీవనశైలిని వైద్యులు సూచిస్తారు. వాటిల్లో ముఖ్యమైనవి... రోజూ వ్యాయామం, ఆహారపు అలవాట్లలో మార్పులు. అధికబరువును తగ్గించుకోవడం. ముఖ్యంగా సుఖమైన నిద్ర పోవాలి. ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి. 


రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాలు ఏరోబిక్స్‌, వాకింగ్‌, జాగింగ్‌, స్విమ్మింగ్‌ వంటివి చేయాలి. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. తగ్గే ప్రతి కేజీ బరువుకి బీపీ 1-2 ఎంఎం హెచ్‌జీ కిందకు దిగుతుంది. 


Updated Date - 2021-05-26T17:37:23+05:30 IST