యాపిల్‌ వాచీ 7 బ్యాటరీ సమస్యకు చెక్‌!

ABN , First Publish Date - 2021-07-03T05:30:00+05:30 IST

యాపిల్‌ వస్తువులకు అలవాటు పడినవారికి ఆ కంపెనీ వాచ్‌ బెస్ట్‌ అనిపిస్తుంది. నిజానికి బెస్ట్‌ వాచీల్లో

యాపిల్‌ వాచీ 7 బ్యాటరీ సమస్యకు చెక్‌!

యాపిల్‌ వస్తువులకు అలవాటు పడినవారికి ఆ కంపెనీ వాచ్‌ బెస్ట్‌ అనిపిస్తుంది. నిజానికి బెస్ట్‌ వాచీల్లో యాపిల్‌ ఒకటి. దాని ఉపయోగాలు ఎన్ని ఉన్నా బ్యాటరీ విషయానికి వస్తే వెనకబడుతుంది. ఒకసారి ఫుల్‌ చార్జింగ్‌ చేసుకుంటే ఒక రోజు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ మాత్రం చార్జింగ్‌ ఉంటుంది.  దీంతో ప్రతీ రోజూ దీనిని చార్జింగ్‌ చేసుకోవాల్సిందే.


కానీ మార్కెట్‌లో ఉన్న ఇతర స్మార్ట్‌ వాచీలను తీసుకుంటే అవి ఒక్కసారి చార్జింగ్‌ చేసుకుంటే రోజులు తరబడి ఉపయోగించు కోవచ్చు. బ్యాటరీ ప్రాతిపదికగా ఏదైనా స్మార్ట్‌ వాచ్‌ను ఎంపిక చేసుకోవాలంటే మాత్రం యాపిల్‌  ఆ లిస్టులో ఉండదు. అయితే, ఎక నామిక్‌ డైలీ న్యూస్‌ రిపోర్ట్‌ ప్రకారం యాపిల్‌ వాచీ 7లో బ్యాటరీ సమస్యకు పరిష్కారం చూపుతోందని సమాచారం. అతి చిన్న చిప్‌ 7తో కొత్త వాచీ విడుదల కానుంది. చిప్‌ చిన్న దైతే స్పేస్‌ కలిసి వస్తుంది. ఆ మేర పెద్ద బ్యాటరీకి ప్లేస్‌ కల్పించవచ్చు. ఫ్లాటర్‌(ఆకట్టుకునే) డిజైన్‌, నునుపైన చుట్టు దిమ్మె, యాపిల్‌ ఎయిర్‌ ట్యాగ్‌ మాదిరిగా అలా్ట్ర వైడ్‌ బ్యాండ్‌ ఫంక్షనాలిటీ కలిగి ఉంది. యాపిల్‌ వాచీ 6తో పోల్చుకుంటే కొద్దిగా మందంగా ఉంది. అదే సమయంలో బ్యాటరీ పై ఎలాంటి ప్రస్తావనా లేదు. కొత్తగా హెల్త్‌ సెన్సార్లు లేవు. వాటన్నింటినీ వచ్చే ఏడాదికి మెరుగుదల కోసం వెనక్కు పెట్టేసిందని ఎకనామిక్‌ డైలీ న్యూస్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.


Updated Date - 2021-07-03T05:30:00+05:30 IST