అలర్జీకి ఆదిలోనే చెక్‌!

ABN , First Publish Date - 2021-10-05T17:54:54+05:30 IST

అలర్జీ బాధ వర్ణణాతీతం. తుమ్ములు, ముక్కు కారడం, ముక్కులు మూసుకుపోవడం, గొంతు నొప్పి, కళ్లలో, చెవుల్లో దురద... అలర్జీ ప్రధాన లక్షణాలు. వీటికి ఎన్ని చికిత్సలు తీసుకున్నా తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం దొరకదు. ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఆధునిక హోమియో వైద్యంలో అలర్జీ సమూలంగా పోతుందంటున్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ మధు వారణాశి.

అలర్జీకి ఆదిలోనే చెక్‌!

ఆంధ్రజ్యోతి(05-10-2021)

అలర్జీ బాధ వర్ణణాతీతం. తుమ్ములు, ముక్కు కారడం, ముక్కులు మూసుకుపోవడం, గొంతు నొప్పి, కళ్లలో, చెవుల్లో దురద... అలర్జీ ప్రధాన లక్షణాలు. వీటికి ఎన్ని చికిత్సలు తీసుకున్నా తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం దొరకదు. ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఆధునిక హోమియో వైద్యంలో అలర్జీ సమూలంగా పోతుందంటున్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ మధు వారణాశి.


చిన్న చిన్న ప్రేరణలు శరీరంలో ఎక్కువ మార్పులను కలుగజేస్తాయి. ఏ వస్తువు వల్ల అలర్జీ వస్తుందో చెప్పడం కష్టమైనప్పటికీ, దేనివల్ల అలర్జీ వస్తుందో చెప్పడానికి వీలుంటుంది.


అలర్జిక్‌ రైనైటిస్‌

మనకు సరిపడాని ప్రేరణలు ముక్కుకు తగిలి, అలర్జీ మొదలైతే హిస్టమైన్‌ విడుదల అవుతుంది. దీంతో ముక్కులోని పొరలు ఉబ్బి, ఆగకుండా తుమ్ములు, ముక్కు కారడం, కళ్లలో, ముక్కులో దురద, మంట, ముక్కులు బిగుసుకుపోవడం జరుగుతుంది. దుమ్ము, చల్లటి పదార్థాలు, ఘాటు వాసనలు, వాతావరణ మార్పుల మూలంగా ఈ లక్షణాలు పెరుగుతాయి. 


అలర్జిక్‌ సైనసైటిస్‌

ముక్కుకు సంబంఽధించిన అలర్జీ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే, ముక్కుకు ఇరువైపులా ఉండే 8 సైనస్‌ గదుల్లో అలర్జీ మొదలవుతుంది. చల్ల గాలి తగిలినా, చల్లటి ఆహారం తీసుకున్నా, వర్షంలో తడిసినా, వాతావరణం మారినా, దుమ్ము, ధూళి సోకినా ఈ సమస్య మొదలవుతుంది. తల బరువుగా ఉండి, వంచితే నొప్పి ఎక్కువవడం, నొసలు, బుగ్గల మధ్య భాగంలో నొప్పి ఉంటుంది. 


ఉబ్బసం

ముక్కులో వచ్చే అలర్జీ ఊపిరితిత్తులకు పాకితే ఆస్తమా బ్రాంఖైటిస్‌ వంటి సమస్యలు మొదలవుతాయి. ఈ వ్యాధి వంశపారంపర్యం. సాధారణ జలుబు, తుమ్ములు, ముక్కు కారడంతో మొదలై దగ్గు, ఆయాసం, పిల్లికూతలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దుమ్ము, వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిడి, చల్లటి పదార్థాల ఆస్తమాకు కారణం కావచ్చు. రాత్రివేళ, తెల్లవారుఝామున లక్షణాలు పెరుగుతాయి.


నాసల్‌ పాలిప్స్‌

అలర్జీ ముదిరితే ముక్కులో పాలిప్స్‌ తయారవుతాయి. ఇవి ముక్కుకు ఇరవైపులా నీటితిత్తుల్లా మారతాయి. సైనస్‌ గదులు నిండిపోయి, ముక్కులోకి వేలాడుతుండడంతో శ్వాస అందక రాత్రుళ్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. రెండు, మూడు సార్లు సర్జరీ చేసినా తిరిగి వస్తూనే ఉంటాయి.


చికిత్స

అలర్జీలకు కారణాలు తెలుసుకుని వాటికి దూరంగా ఉండాలి. సర్జరీతో ప్రయోజనం ఉన్నా, అది తాత్కాలికమే! కాబట్టి మూల కారణాన్ని బట్టి చికిత్స అందించాలి. ఇక్కడే హోమియో చికిత్సావిధానం ప్రాధాన్యం తెలిసి వస్తుంది. అలర్జీతో బాధపడుతున్నప్పుడు ఒక విధంగా, లేనప్పుడు మరో విధంగా హోమియో చికిత్స కొనసాగుతుంది. వ్యాధులు, మందుల గురించి అవగాహన ఉన్న వైద్యులను సంప్రతించి చికిత్స తీసుకుంటే సమస్య దూరమవుతుంది. హోమియో వైద్య విధానం నియమబద్ధమైనది, శాస్త్రీయమైనది. అనుభవజ్ఞులైన వైద్యుల చికిత్సతో అలర్జీ సమస్యను శస్త్రచికిత్స అవసరం లేకుండా నివారించవచ్చని అనడంలో సందేహం లేదు.


డా. మధు వారణాశి

MD, MS(PSYCHO), MCSEP

ప్రముఖ హోమియో వైద్యులు

ప్లాట్‌నెం 188, వివేకానందనగర్‌ కాలనీ

కూకట్‌పల్లి, హైదరాబాద్‌

ఫోన్‌ : 8897331110, 8886509509


Updated Date - 2021-10-05T17:54:54+05:30 IST