మెడిసిన్‌లో సీటు తీసిస్తామని మోసం

ABN , First Publish Date - 2021-03-05T04:29:31+05:30 IST

మెడిసిన్‌లో సీటు తీసిస్తామని చెప్పి ఓ మహిళ నుంచి లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేసిన నలుగురిపై చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది.

మెడిసిన్‌లో సీటు తీసిస్తామని మోసం

నలుగురిపై చీటింగ్‌ కేసు నమోదు


చిత్తూరు, మార్చి 4: మెడిసిన్‌లో సీటు తీసిస్తామని చెప్పి ఓ మహిళ నుంచి లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేసిన నలుగురిపై చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ కథనం మేరకు... చిత్తూరులోని పగడమానువీధికి చెందిన ధనలక్ష్మి తన కుమార్తె కావ్యకు మెడిసిన్‌ సీటు కోసం ఖమ్మం జిల్లా గద్వాలకు చెందిన అమీర్‌ను కలిసింది. అమీర్‌ మరో ముగ్గురితో మాట్లాడించాడు. బెంగళూరులోని ఆకాష్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మేనేజ్‌మెంట్‌ కోటా కింద మెడిసిన్‌లో సీటు ఇప్పిస్తామని నమ్మించడంతో 2019లో నలుగురికీ కలిపి ధనలక్ష్మి రూ.36 లక్షలు ఇచ్చింది. అయితే వారు కళాశాలలో డబ్బు కట్టకపోవడంతో యాజమాన్యం సీటు రద్దు చేసింది. అప్పటికే ధనలక్ష్మి చెల్లించిన హాస్టల్‌, ఇతర ఫీజులను కళాశాల యాజమాన్యం తిరిగి ఇచ్చేసింది. మెడిసిన్‌లో సీటు తీసిస్తామని డబ్బు తీసుకున్న అమీర్‌తో పాటు మరో ముగ్గురిపై ధనలక్ష్మి వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ మోహన్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-05T04:29:31+05:30 IST