Jul 8 2021 @ 21:33PM

సల్మాన్‌ఖాన్‌, అతని సోదరిపై చీటింగ్‌ కేసు

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, అతని సోదరి అల్విరా ఖాన్‌ అగ్నిహోత్రితో పాటు.. ఆయనకు చెందిన 'బీయింగ్‌ హ్యుమన్‌ ఫౌండేషన్‌'కు చెందిన మరో ఏడుగురిపై చండీగఢ్‌కు చెందిన ఓ బిజినెస్‌ మ్యాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అరుణ్‌ గుప్తా అనే బిజినెస్‌ మ్యాన్‌ 'బీయింగ్‌ హ్యుమన్‌ ఫౌండేషన్‌' సభ్యులు చండీగఢ్ లో ఫ్రాంచైజ్ ఏర్పాటు చేయమని చెప్పిన మాటలు విని.. 'బీయింగ్‌ హ్యుమన్‌ జ్యూవెలరీ' అనే షోరూమ్‌ను మనీమాజ్రాలో ఓపెన్‌ చేశాడు. షోరూమ్‌ నిర్మాణానికి, ఇతరత్రా పనులకు కలిపి దాదాపు రూ. 3 కోట్ల వరకు ఆయన ఖర్చు పెట్టాడు. అయితే ఆ ఏరియాలో షోరూమ్‌ ప్రారంభించాలని బీయింగ్ హ్యూమన్ సంస్థలోని ఉద్యోగులే తనను కోరారని, ఆ సంస్థ నుంచి రావాల్సిన సరుకు తమకు రాకపోగా, సంస్థకు చెందిన వెబ్‌ సైట్‌ కూడా ఓపెన్‌ కావడం లేదని పేర్కొంటూ అరుణ్‌ గుప్తా పోలీసులను సంప్రదించాడు. అంతేకాదు బిగ్‌బాస్‌ సెట్లోకి తనని పిలిచి సల్మాన్‌ శుభాకాంక్షలు తెలిపారని, అలాగే షోరూమ్‌ ఓపెనింగ్‌కి కూడా వస్తానని మాట ఇచ్చారని, 1.5 సంవత్సరాలైనా ఆయన రాలేదని, ఎన్ని లెటర్స్ రాసినా సమాధానం ఇవ్వకుండా సల్మాన్ మాట తప్పారని అరుణ్‌ గుప్తా పోలీసులకు తెలిపాడు. అరుణ్‌ గుప్తా స్టేట్‌మెంట్‌ పరిశీలించిన ఎస్పీ కేతన్‌ బన్సాల్‌.. సల్మాన్‌ అండ్‌ టీమ్‌పై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. 13వ తేదీలోపు ఈ కేసుపై వివరణ ఇవ్వాలని సల్మాన్‌ను ఆదేశించినట్లుగా ఎస్పీ పేర్కొన్నారు.


Bollywoodమరిన్ని...