ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతూ మోసం

ABN , First Publish Date - 2021-06-22T05:28:50+05:30 IST

ఖాతాదారుల ఆధార్‌, పాన్‌కార్డు వంటి ధ్రువపత్రాల ఆధా రంగా వారి పేరుతో సిమ్‌ కార్డులు కొనుగోలు చేసి, ఫేక్‌ జీపీఎస్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుని నిషేధిత ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతూ మోసాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు.

ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతూ మోసం
వివరాలు తెలియజేస్తున్న డీసీపీ ఐశ్వర్య రస్తోగి

నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

డీసీపీ ఐశ్వర్య రస్తోగి

విశాఖపట్నం, జూన్‌ 21: ఖాతాదారుల ఆధార్‌, పాన్‌కార్డు వంటి ధ్రువపత్రాల ఆధా రంగా వారి పేరుతో సిమ్‌ కార్డులు కొనుగోలు చేసి, ఫేక్‌ జీపీఎస్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుని నిషేధిత ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతూ మోసాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూరల్‌ జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన కారె తాతారావు (32) ఓ సెల్‌ కంపెనీ సిమ్‌ల రిటై లర్‌. కొవిరి జగన్నాథం (30), వాకాడ జానకిరామ్‌రెడ్డి (27), వై.బండయ్యలు ఇతని స్నేహితులు. 

తన కొనుగోలుదారుల ధ్రువపత్రాలతో తాతారావు  సిమ్‌లు కొనుగోలుచేసి, వాటితో జీపీఎస్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకునే వాడు. వాటి ఆధారం గా ఈ నలుగురూ ఆన్‌లైన్‌ రమ్మీ ఆడేవారు.  నలుగురు ఆడే రమ్మీ గేమ్‌లో వీరిలో ముగ్గురే పాల్గొని కుమ్మక్కయి నాలుగో వ్యక్తి అయిన అపరిచితుడిని ఓడించి డబ్బులు వసూలు చేసే వారు. ఈ విధంగా ఒక్కొక్కరూ నెలకు రూ.45 వేల వరకు సంపాదించేవారు. అలాగే తమమద్దకు వచ్చే వారి ధ్రువ పత్రాలతో సిమ్‌ కార్డులు తీసుకుని ఒక్కోదానికి రూ.3 వేలు ఎదురు డబ్బులు ఇచ్చేవారు.  ఇలా ఎదురు డబ్బులిచ్చి సిమ్‌ కార్డులు కొనడంపై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేడంతో వీరి బండారం బయటపడింది. 

Updated Date - 2021-06-22T05:28:50+05:30 IST