OLXలో పెట్టిన యాడ్ చూసి కాల్ చేసిన వ్యక్తి.. ఫర్నిచర్ కొంటానంటూ బేరం.. చివరకు చూస్తే..

ABN , First Publish Date - 2022-01-13T16:00:32+05:30 IST

అతను ఫర్నిచర్ అమ్ముతానంటూ ఓఎల్ఎక్స్‌లో యాడ్ పోస్ట్ చేశాడు.. ఆ యాడ్ చూసి ఓ వ్యక్తి కాల్ చేశాడు..

OLXలో పెట్టిన యాడ్ చూసి కాల్ చేసిన వ్యక్తి.. ఫర్నిచర్ కొంటానంటూ బేరం.. చివరకు చూస్తే..

అతను ఫర్నిచర్ అమ్ముతానంటూ ఓఎల్ఎక్స్‌లో యాడ్ పోస్ట్ చేశాడు.. ఆ యాడ్ చూసి ఓ వ్యక్తి కాల్ చేశాడు.. తను కొనుక్కుంటానన్నాడు.. రేటు విషయంలో బేరం ఆడాడు.. డబ్బులు వేస్తానని చెప్పి బ్యాంక్ వివరాలు అడిగాడు.. చివరకు రూ.56 వేలు కాజేశాడు.. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.. హర్యానాలోని అంబాలాలో ఈ ఘటన జరిగింది. 


అంబాలాకు చెందిన సతీష్ మహంత్ అనే వ్యక్తి పాత ఫర్నిచర్ అమ్ముతానంటూ ఓఎల్‌ఎక్స్‌లో యాడ్ పోస్ట్ చేశాడు. ఆ యాడ్ చూసి ఓ వ్యక్తి కాల్ చేశాడు. ఫర్నిచర్ బాగుందని, తనకు కావాలని అడిగాడు. రేటు విషయంలో బేరం ఆడాడు. చివరకు రూ.3800కు ఒప్పందం కుదిరింది. డబ్బులు పేటీఎమ్ ద్వారా పంపిస్తానని చెప్పి సతీష్ బ్యాంక్ ఖాతా వివరాలు అడిగాడు. 


సతీష్ తన డెబిట్ కార్డు వివరాలు, ఓటీపీ కూడా చెప్పేశాడు. దీంతో అవతలి వ్యక్తి సతీష్ ఖాతా నుంచి రూ.56 వేలు లాగేశాడు. ఆ విషయం సతీష్‌కు ఒకరోజు ఆలస్యంగా తెలిసింది. వెంటనే అతను సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.  

Updated Date - 2022-01-13T16:00:32+05:30 IST