నాసిరకం వరి విత్తనాలిచ్చి మోసగించారు

ABN , First Publish Date - 2020-10-02T08:24:20+05:30 IST

తక్కువ సమయంలోనే పంట వస్తుందని చెప్పి నాసిరకం వరి విత్తనాలు ఇచ్చి తమను మోసగించారని ఆరోపిస్తూ గొల్లప్రోలులోని స్రవంతి అగ్రో ఏజెన్సీస్‌ వద్ద తొండంగి ..

నాసిరకం వరి విత్తనాలిచ్చి మోసగించారు

గొల్లప్రోలులో విత్తనాల షాపు వద్ద రైతుల ధర్నా


గొల్లప్రోలు, అక్టోబరు 1: తక్కువ సమయంలోనే పంట వస్తుందని చెప్పి నాసిరకం వరి విత్తనాలు ఇచ్చి తమను మోసగించారని ఆరోపిస్తూ గొల్లప్రోలులోని స్రవంతి అగ్రో ఏజెన్సీస్‌ వద్ద తొండంగి మండలం కృష్ణాపురం పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు ధర్నాకు దిగారు. మిర్చి పంట వేసుకునేందుకు వీలుగా తక్కువ సమయంలోనే దిగుబడి ఇస్తుందని చెప్పి జేకే సీడ్స్‌కు చెందిన కోయల్‌ వరి విత్తనాలు ఇచ్చారని, పది కిలోల ప్యాకెట్‌ రూ.850కి కొనుగోలు చేసినట్టు రైతులు మాకినీడి రాజబాబు, వెంకటరమణ, వెన్నా శివరామకృష్ణ, శ్రీనివాస్‌ తదితరులు తెలిపారు. ఇప్పుడు పంట పక్వానికి రాలేదని, దీంతో తాము నష్టపోయామని తెలిపారు. తమకు పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న గొల్లప్రోలు మండల వ్యవసాయాధికారిణి నవీన అక్కడకు చేరుకుని వారితో చర్చించారు. రైతుల బిల్లులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.

Updated Date - 2020-10-02T08:24:20+05:30 IST