దేవర ఉత్సవానికి చాటింపు

ABN , First Publish Date - 2021-05-18T05:11:57+05:30 IST

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ దేవర ఉత్సవానికి చాటింపు వేశారు. ఆలయ ఈవో కిషోర్‌కుమార్‌, పురోహితులు, ఆలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు పైడిమాంబ చదురుగుడి వద్ద ఈ చాటింపు ప్రక్రియ నిర్వహించారు. ఏటా వైశాఖమాసంలో దేవర ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

దేవర ఉత్సవానికి చాటింపు
చాటింపు వేస్తున్న దృశ్యం

24న నిర్వహణకు నిర్ణయం

విజయనగరం రూరల్‌, మే 17: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ దేవర ఉత్సవానికి చాటింపు వేశారు. ఆలయ ఈవో కిషోర్‌కుమార్‌, పురోహితులు, ఆలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు పైడిమాంబ చదురుగుడి వద్ద ఈ చాటింపు ప్రక్రియ నిర్వహించారు. ఏటా వైశాఖమాసంలో దేవర ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అక్టోబరు నెలలో జరిగే సిరిమానోత్సవానికి ఇది నాంది. మధ్యాహ్నం 3.30 గంటలకు చదురుగుడిలోని పైడిమాంబకు ఆలయ ఈవో, అర్చకులు, ఉద్యోగులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైడిమాంబను వివిధ రకాల పువ్వులతో అలంకరించారు. వివిధ పండ్లను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం 4 గంటల ప్రాంతంలో ఆలయం ఎదుట తలయారీ చాటింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 24న దేవర ఉత్సవాన్ని కరోనా నిబంధనలు నడుమ నిర్వహించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. 


Updated Date - 2021-05-18T05:11:57+05:30 IST