తరుముకొచ్చిన పౌరుషాగ్ని

ABN , First Publish Date - 2022-01-13T09:11:32+05:30 IST

కోడి పుంజు కాలు దువ్వి మోర ఎత్తి జూలు దులిపి కాపు కాసింది!....

తరుముకొచ్చిన పౌరుషాగ్ని

కోడి పుంజు

కాలు దువ్వి

మోర ఎత్తి

జూలు దులిపి

కాపు కాసింది!


సంక్రాంతి 

కాంతుల్లో

దగా నగారా 

మారు మ్రోగింది! 


పల్లెలో 

పౌరుషాగ్ని

పందెమై 

తరుముకొచ్చింది!


గోదారి 

భూమ్మీద

ఊడిగం

ఉరుము కొచ్చింది!


బరి గీసి 

బూచోడు 

భుజ బలమే 

చూపించగ!


ఎస్సీ బీసీ

పేద జనం

రాచభటులుగ

అవతరించే!


గుమ గుమల 

పలా వెట్టి

కోడి మాంసం 

కూర పెట్టి 

మద్యం సీస 

ముందు పెట్టి 

కని కట్టు

కక్ష్య చుట్టాడు!


అరె!                                                    

నీ కాళ్ళకు కత్తి కట్టాడే 

నిన్ను పందెం కోడి చేశాడే

వాడు 

రారాజుగా వెలుగొందాడే

రాజ్యాలను ఏలుతున్నాడే!

ఎన్.క్యూబ్

Updated Date - 2022-01-13T09:11:32+05:30 IST