కరోనాపై పోరుకు విరాళం ప్రకటించిన ఐసీఏఐ

ABN , First Publish Date - 2020-04-10T01:21:44+05:30 IST

కరోనా వైరస్ (కోవిడ్‌-19) నివారణ కోసం కేంద్రం ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ.21 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆప్ చార్టర్డ్ అకౌంటెంట్స్

కరోనాపై పోరుకు విరాళం ప్రకటించిన ఐసీఏఐ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్‌-19) నివారణ కోసం కేంద్రం ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ.21 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆప్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) గురువారం ప్రకటించింది. మార్చి 31వ తేదీన సంస్థ 1.72 కోట్లు విరాళం ఇచ్చింది. కాగా, గురువారం మరో 15 కోట్లను ఫండ్స్‌లో జమా చేసిన ఐసీఏఐ.. ఏప్రిల్ 20వ తేదీ లోగా.. మరో రూ.4.28 కోట్లను జమా చేస్తామని హామీ ఇచ్చింది.


‘‘అసోసియేషన్‌లో ఉన్న సభ్యులు, విద్యార్థులు, అధికారుల నుంచి డబ్బు సేకరించి రూ.6 కోట్లు పీఎం-కేర్స్‌కి ఇస్తామని హామీ ఇస్తున్నాము. మార్చి 31, 2020న రూ.1.72 కోట్లు తొలి విరాళంగా ప్రధానమంత్రి సహాయ నిధిలో జమా చేశాము. మిగితా రూ.4.28 కోట్లు ఏప్రిల్ 20వ తేదీలోగా పీఎం కేర్స్ ఫండ్‌లో జమా చేస్తాము. అంతేకాక ప్రధాన మంత్రి పిలుపు మేరకు ఐసీఏఐ తరఫున రూ.15 కోట్లు విరాళంగా ఇవ్వాలని సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకుంది ’’ అని ఐసీఏఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 

Updated Date - 2020-04-10T01:21:44+05:30 IST