Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

షార్లెట్ ఎన్నారై టీడీపీ సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగ!

twitter-iconwatsapp-iconfb-icon

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా అమెరికాలో నార్త్ కెరొలినా రాష్ట్రంలోని షార్లెట్ నగరంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు సమావేశమయ్యారు. ఎన్నారై టీడీపీ షార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది హాజరయ్యి విజయవంతం చేశారు.


ఆదివారం మార్చి 27 సాయంత్రం షార్లెట్‌లోని స్థానిక స్టోన్క్రీక్ రాంచ్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక తెలుగుదేశం పార్టీ, అమరావతి విషయాల్లో షార్లెట్ వాసులు ఎప్పటికప్పుడు తమ అభిమానాన్ని, సహాయాన్ని చాటుకోవడంలో ముందు వరుసలోనే ఉన్నారు.

షార్లెట్ ఎన్నారై టీడీపీ సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగ!


ఈ ఆత్మీయ సమావేశాన్ని అనంతపూర్ ప్రముఖ ప్రవాసాంధ్రుడు పురుషోత్తం చౌదరి గుడే అధ్యక్షతన ఠాగూర్ మల్లినేని సమన్వయం చేసారు. ఈ పసుపు పండుగని విజయవంతం చేయడంలో రవి నాయుడు, సచీన్ద్ర ఆవులపాటి తోడ్పాటు వెలకట్టలేనిది. ముందుగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు పఠానికి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు ద్వారా సమాజంలో సమున్నత స్థానాన్ని అందుకునేలా తోడ్పడిన అన్న ఎన్టీఆర్‌కు మరియు తెలుగుదేశం పార్టీకి ముందునుంచి మహిళల సపోర్ట్ ఎక్కువే.

షార్లెట్ ఎన్నారై టీడీపీ సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగ!

షార్లెట్ కార్యక్రమంలో మహిళలు పసుపు చీరలు ధరించి పాల్గొనడం, అలాగే జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినదించడం చూస్తే తెలుగుదేశం పార్టీకి ఇంకా మహిళల మద్దతు పెరిగిందనే చెప్పాలి. పెద్దలు ప్రసంగిస్తూ ఉంటే పిల్లలు సైతం ఆతృతగా వినడం విశేషం. మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున ముందుండి కేక్ కట్ చేసి అందరికీ తెలుగుదేశం పార్టీ 40 వసంతాల శుభాభినందనలు తెలియజేసారు.


స్థానిక తెలుగుదేశం పార్టీ షార్లెట్ ఎన్నారై సిటీ కౌన్సిల్ సభ్యులు, అభిమానులు, నాయకులు, ముఖ్యంగా మహిళలు పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ నెలకొన్న పరిస్థితులపై తమ తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరింత ఉధృతంగా ముందుకు నడవాలన్నారు.

షార్లెట్ ఎన్నారై టీడీపీ సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగ!

రాయలసీమ నుంచి అనంతపూర్ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరీ,  కృష్ణా జిల్లా పెనమలూరు మాజీ శాసనసభ్యులు బోడే ప్రసాద్ ఆన్లైన్లో జూమ్ మీటింగ్ ద్వారా పాల్గొనడంతో అందరి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత మోహన్ కొవ్వలి ఈ కార్యక్రమానికి ముఖాముఖీగా హాజరవ్వడం విశేషం. వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ దగ్గిర నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడు, పార్టీ, ప్రజలు, పాలన, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై గంటపాటు సుదీర్ఘంగా ఆహుతులనుద్దేశించి ప్రసంగించారు. 


అనంతరం బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీతో తనకున్న అనుబంధాన్ని, ప్రస్తుత పరిస్థితులు, ప్రజల స్థితిగతులు, చంద్రబాబు పాలనాభివృద్ధి, పార్టీ ద్వారా అందరి ఎదుగుదల ఇతరత్రా విషయాలపై కూలంకుషంగా చాలా సమయంపాటు వివరించారు. అమెరికాలో ఉంటూ ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ పార్టీ కోసం పనిచేస్తూ తద్వారా ఏమీ ఆశించకుండా, అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ వెన్నంటి ఉండి నడుస్తున్న షార్లెట్ ఎన్నారై టీడీపీ సైనికులకు ‘ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం’ అని అతిధులు ప్రశంసించడం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం.


పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు,  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఆహుతులందరూ అడిగిన ప్రశ్నలకు వైకుంఠం ప్రభాకర్ చౌదరి, బోడే ప్రసాద్ ఎంతో ఓపికగా సమాధానాలు అందించారు. చివరిగా నిర్వాహకులు అందరికీ ధన్యవాదాలు తెలిపి అల్పాహారంతో కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.