Jul 21 2021 @ 20:04PM

పొయెటిక్ ఫీల్‌తో.. ‘చ‌రిత కామాక్షి’ ఫ‌స్ట్ లుక్

ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యాన‌‌ర్‌పై ర‌జ‌నీ రెడ్డి నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు స్త్రీ లంక చందు సాయి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చ‌రిత కామాక్షి’. రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో న‌వీన్ బేతిగంటి, దివ్య శ్రీపాద లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ టైటిల్‌ లుక్‌ని చిత్రయూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. టైటిల్‌ లుక్‌తోనే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించగా తాజాగా చిత్రయూనిట్ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఈ సినిమాలో లీడ్ పాత్ర‌లు పోషించిన న‌వీన్ బేతిగంటి, దివ్య శ్రీపాద‌లు స్టిల్స్‌తో పొయెటిక్ ఫీల్ వ‌చ్చేలా ఈ ఫ‌స్ట్ లుక్‌ని డిజైన్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ ‌లుక్‌ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. యూత్ ఆడియెన్స్‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని సంపూర్ణంగా ఆక‌ట్టుకునే రీతిన ఈ సినిమాను ద‌ర్శ‌కుడు స్త్రీ లంక చందు సాయి తెర‌కెక్కించార‌ని నిర్మాత ర‌జ‌నీ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియజేయనున్నారు.