బాధ్యతలు స్వీకరించిన ఆచంట ఎంపీపీ సూర్యకుమారి

ABN , First Publish Date - 2021-09-29T05:49:47+05:30 IST

ఆచంట ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి మం డల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరించిన ఆచంట ఎంపీపీ సూర్యకుమారి
బాధ్యతలు స్వీకరిస్తున్న ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి

ఆచంట, సెప్టెంబరు 28 : ఆచంట ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి మం డల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంత రం ఆమె మాట్లాడుతూ మండల  అభి వృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉం టానన్నారు. పలువురు పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉప్పలపాటి  సురేష్‌బాబు, జనసేన ఇన్‌ఛార్జి చేగొండి సూర్యప్రకాష్‌,  వైస్‌ ఎంపీపీ యర్రగొప్పుల నాగరాజు, ఎంపీటీసీలు తాళం శ్రీనివాస్‌, ఆరిమిల్లి సుబ్బారావు, సర్పంచ్‌ అల్లం పద్మావతి, కేతా మీరయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-29T05:49:47+05:30 IST