Abn logo
May 30 2020 @ 11:08AM

చ‌ర‌ణ్ త‌దుప‌రి డైరెక్టర్ ఖరారు..?

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ చేయ‌బోయే త‌దుప‌రి సినిమాపై ప‌లు ర‌కాల వార్త‌లు విన‌ప‌డ్డాయి. ఇద్ద‌రు, ముగ్గురు ద‌ర్శ‌కుల పేర్లు కూడా విన‌ప‌డ్డాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు చెర్రీ త‌దుప‌రి సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరితో చేయ‌డం దాదాపు ఖాయ‌మైంద‌నే అంటున్నారు. ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారట‌. షూటింగ్స్ ప్రారంభ‌మైన త‌ర్వాత చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉంటాడు. ఈలోపు గౌత‌మ్ తిన్న‌నూరి బాలీవుడ్ మూవీ జెర్సీని పూర్తి చేసి చ‌ర‌ణ్ ప్రాజెక్ట్‌పై ఫోక్స్ పెడ‌తాడ‌ని టాక్‌. మ‌రి సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న ఈ వార్త‌ల‌పై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement