’వనవాసం‘లో రామాయణ పాత్రధారులు.. శ్రీరాముడు డ్రైవర్... కూరలు అమ్ముకునే లక్ష్మణుడు, రూ. 500 వేతనంతో బతుకీడుస్తున్న సీతామాత!

ABN , First Publish Date - 2021-10-09T17:44:51+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పట్టణంలోని...

’వనవాసం‘లో రామాయణ పాత్రధారులు.. శ్రీరాముడు డ్రైవర్... కూరలు అమ్ముకునే లక్ష్మణుడు, రూ. 500 వేతనంతో బతుకీడుస్తున్న సీతామాత!

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ పట్టణంలోని గోరఖ్‌నాథ్ మందిరం సమీపంలోని రామలీలా మైదానంలో 104 ఏళ్లుగా రామలీలా కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతీఏటా 18 రోజుల నుంచి 20 రోజుల పాటు ఈ సాస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తుంటారు. దీనిని చూసేందుకు దూరప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలివస్తుంటారు. ఈసారి ఇక్కడి రామలీల ప్రదర్శనకు అయోధ్య నుంచి కళాకారులు వచ్చారు. రామాయణ గాథను ప్రదర్శించే ఈ కళాకారులు దుర్భర పరిస్థితిలో జీవిస్తున్నారు. 


రామలీలలో రాముని పాత్ర పోషించే రోషన్ మిశ్రా కుటుంబ పోషణకు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అదేవిధంగా లక్ష్మణుని పాత్ర పోషిస్తున్న కళాకారుడు కూరగాయలు విక్రయిస్తున్నారు. రావణాసుడురు సంస్కృతం టీచరుగా చాలీచాలని జీతంలో బతుకు వెళ్లదీస్తున్నారు. ఇక సీతామాత పాత్ర పోషిస్తున్న కళాకారిణి రోజుకు రూ. 500 వేతనంపై కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నారు. వీరందరి వృత్తులు వేరయినప్పటికీ వీరంతా నటనపై ఇష్టంలో రామలీలో భాగస్వాములయ్యారు. స్టేజీపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చే వీరు నిజజీవితం అనేక కష్టాలను అనుభవిస్తున్నారు. విజయదశమి నాడు ఉదయం బాబా గురు గోరక్షనాథ్ మందిరంలో విశేష పూజలు జరుగుతాయి. ఆరోజు సాయంత్రం రామలీలా మైదానంలో రామలీల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు.



Updated Date - 2021-10-09T17:44:51+05:30 IST