Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెప్పులే.. తొక్కిపడేస్తాయ్‌...

హైదరాబాద్ : ఈ ఏడాదిలో కొవిడ్‌ ఆంక్షల అన్‌లాకింగ్‌ నుంచి మొదలుకుని, అంటే... మే ప్రారంభం నుంచి నవంబరు వరకు ఫుట్‌వేర్‌ కంపెనీలు దుమ్మురేపాయి. బాటా, రిలాక్సో తదితర  లిస్టెడ్ మేజర్స్‌ నవంబరులో 52-వారాల గరిష్టాలకు చేరుకున్నాయి. ఈ ఏడు నెలల్లోనే 40-66 శాతం లాభపడి, బీఎస్‌ఈ ః500 పీర్స్‌ కంటే ఔట్‌ఫెర్ఫార్మ్‌ చేశాయి. అన్‌లాక్‌ నేపధ్యంలో... ఫుట్‌వేర్‌ అమ్మకాలు దాదాపుగా... కరోనా ముందుస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు కంపెనీల్లో విస్తరణలు, హయ్యర్‌ ఆపరేషనల్‌ లీవరేజ్‌, ప్రీమియమైజేషన్ నేపధ్యంలో...  ఇన్వెస్టర్లు... వాటి ఆదాయాలు, మార్జిన్లు  పెరుగుతాయన్న అంచనాలతో భారీగా షేర్లు కొన్నారు. మీడియం టర్మ్‌లో ఈ కంపెనీలపై స్ట్రీట్ బుల్లిష్‌గా ఉన్నప్పటికీ... నియర్‌ టర్మ్‌లో మాత్రం కొన్ని సవాళ్లు లేకపోలేదని భావిస్తున్నారు. 


రూ. 1,000 వరకు ధర ఉన్న ఫుట్‌వేర్‌ మీద జీఎస్‌టీని... 5-12 శాతానికి పెంచడం పధాన అవరోధమని చెబుతున్నారు‌. దీంతో... మార్జిన్లతోపాటు డిమాండ్‌పైనా ప్రభావముంటుందని చెబుతున్నారు. ‘చెప్పులో ముల్లు’ వంటి ఈ ప్రభావాన్ని తగ్గించుకునే క్రమంలో... ఇప్పటికే గిడ్డంగుల్లో ఉన్న నిల్వలను వేగంగా విక్రయించుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని వినవస్తోంది. ఈ క్రమంలోనే... అదనపు రాయితీలను కూడా ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు. ఈ అదనపు రాయితీల ఫలితంగా మార్జిన్లపై ఒత్తిడి కనిపిస్తుందని చెబుతున్నారు. 


సెప్టెంబరు చివరినాటికి రిలాక్సో ఫుట్‌వేర్‌ నిల్వలు రూ. 542 కోట్లు కాగా, బాటా నిల్వలు రూ. 728 కోట్లు. రిలాక్సో ఒక్కో యూనిట్‌కు సగటు అమ్మకం ధర రూ. 150 కాగా, బాటాకు రూ. 750గా ఉంది. జీఎస్‌టీ పెంపు ప్రభావం వీటిపై పడుతుందని చెబుతున్నారు. కాగా...  ఈ జీఎస్‌టీ పెంపును కొనుగోలుదారులకు బదిలీ చేయడం వల్ల డిమాండ్‌ తగ్గుతుంది. ఇది మరొక ఇబ్బందికర అంశంగా సంస్థలు, వ్యాపారులు భావిస్తున్నారు. జీఎస్‌టీ రేట్లలో అదనపు పెరుగుదలను కలిపినపక్షంలో, రానున్న సీజన్‌లో ఫుట్‌వేర్‌ ధరల్లో... 15-20 % పెంపు ఉండవచ్చు.  అయితే...  దీనివల్ల రికవరీ మందగించే అవకాశం ఉందని ‘ఎస్ సెక్యూరిటీస్’ చెబుతోంది. 


నిజానికి, పెరిగిన ముడిసరుకు ఖర్చులతో సెప్టెంబరు  త్రైమాసికంలోనే మార్జిన్లు తగ్గాయి. రిలాక్సో గ్రాస్‌ మార్జిన్లు 660 బేసిస్ పాయింట్ల(బీపీఎస్) మేర పడిపోయాయి, ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ మార్జిన్లు వార్షిక ప్రాతిపదికన 560 బీపీఎస్ మేర తగ్గాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు... 15 % మేర ధరలను పెంచినప్పటికీ కూడా  మార్జిన్లలో కోత కనిపించడం గమనార్హం. అవుట్‌డోర్ యాక్టివిటీస్‌ పెరగడం, విద్యాసంస్థలు తెరవడం, అన్ని కేటగిరీల్లో అమ్మకాలు పెరిగి డిమాండ్ పుంజుకుంటున్న ఈ సమయంలో ఈ రంగానికి ఎదురుగాలి వీస్తోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆనంద్ రాఠీ రీసెర్చ్ ప్రకారం... ఫుట్‌వేర్ కంపెనీల అమ్మకాల్లో సగటు వృద్ధి, 41 % పెరిగింది. బాటా 77 % తో లీడ్‌ చేస్తుండగా, ఖాదిమ్ ఇండియా 33 %, రిలాక్సో 24 % వృద్ధిని నమోదు చేశాయి.


స్లిప్పర్లు, ఓపెన్ ఫుట్‌వేర్‌కు ఏడాది కాలంగా బాగా డిమాండ్ ఉన్నప్పటికీ, ఇప్పుడు మాత్రం ట్రెండ్‌ మారుతున్నట్లు భావిస్తున్నారు. రెండడో త్రైమాసికంలో... ఔట్‌సైడ్‌ వేర్‌, క్లోజ్డ్ ఫుట్‌వేర్‌ వాల్యూమ్స్‌ పెరుగుతుండడం విశేషం. ఇక... ఇదే తరహాలో... ఫ్యాషన్, వెడ్డింగ్, ఫెస్టివల్ సెగ్మెంట్లు కూడా మెరుగుపడ్డాయి. అయితే...  మళ్లీ కలవరపెడుతున్న కొత్త కోవిడ్ వేరియంట్‌ నేపధ్యంలో... ఈవెంట్లు, ప్రయాణాలపై ఆంక్షలు చోటుచేసుకున్నపక్షంలో... ఈ సెగ్మెంట్లు మళ్లీ ఇబ్బందిపడక తప్పదని అంచనా. 


ఇక మేజర్‌ లిస్టెడ్ కంపెనీల్లో... బాటా అమ్మకాలు కోవిడ్ పూర్వ స్థాయిల్లో 85 శాతానికి చేరాయి. విడివిడిగా చూస్తే... ఫార్మల్‌, స్కూల్‌ ఫుట్‌వేర్స్‌లో రికవరీ 60-65 శాతానికి చేరాయి. క్యాజువల్‌ ఫుట్‌వేర్‌ అమ్మకాల్లో పెరుగుదల కనిపిస్తోంది. కోవిడ్‌కు ముందు మొత్తం ఆదాయంలో ఈ సెగ్మెంట్‌ వాటా 30 శాతంగా ఉండగా, ప్రస్తుతం 40 శాతం వరకు అందిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో అమ్మకాలను మరింతగా పెంచాలన్నది కంపెనీ లక్ష్యంగా ఉంది‌. కాగా... డిజిటల్ ఛానెల్ ద్వారా అమ్మకాలు బాగానే సాగుతున్నట్లు భావిస్తున్నారు. మొత్తం ఆదాయంలో దీని వాటా 14 శాతం. ఇది మరొక గ్రోత్‌ ట్రిగ్గర్ కావచ్చునని అంచనా వేస్తున్నారు. 


ఇక... గత సంవత్సర కాలంగా స్లిప్పర్స్‌, ఓపెన్ ఫుట్‌వేర్‌ సెగ్మెంట్‌లో రిలాక్సో బాగా లాభపడింది. మొత్తం ఆదాయాల్లో 85-90 శాతం ఈ సెగ్మెంట్‌ నుంచే వచ్చింది. ప్రీమియమైజేషన్‌పై కంపెనీ దృష్టి పెట్టినందున, ప్రతీ సెగ్మెంట్‌లో మరిన్ని ప్రీమియం ఉత్పత్తులు రానున్నాయి. ఈ క్రమంలో... గ్రాస్‌ మార్జిన్లు పెరుగనున్నట్లు చెబుతున్నారు. బాటా, రిలాక్సో షేర్లు కొనాలనుకుంటున్న ఇన్వెస్టర్లు... ఈ నియర్‌టర్మ్‌ హెడ్‌విండ్స్‌ను దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్పత్తుల ధరల్లో మార్పులు, డిమాండ్‌ ట్రెండ్స్‌, కంపెనీల మార్జిన్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. 

Advertisement
Advertisement