అస్తవ్యస్తంగా డ్రైనేజీ - ఇండ్ల మధ్యలో మురుగు

ABN , First Publish Date - 2021-06-18T04:56:11+05:30 IST

డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఇళ్లమ ధ్యలోకి మురుగునీరు చేరి ప్రజలను రోగాల బారిన పడేస్తోందని ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.

అస్తవ్యస్తంగా డ్రైనేజీ - ఇండ్ల మధ్యలో మురుగు
ఇండ్ల మధ్యలోకి వెళుతున్న మురుగు నీరు

దువ్వూరు, జూన 17: డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఇళ్లమ ధ్యలోకి మురుగునీరు చేరి ప్రజలను రోగాల బారిన పడేస్తోందని ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. దువ్వూరు ప్రధాన రహదారికి  ఇరువైపులా డ్రైనేజీ కాల్వలు పూడిక తొలగించారు.

అయితే ఊరి చివర్లో డ్రైనేజీ గుండా వచ్చే మురుగు బయటకు వెళ్లేందుకు పూర్తిస్థాయిలో కాల్వల నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగునీరు పొంగి ఇళ్లమధ్యలోకి చేరు తోంది. దీంతో విషపురుగులు వస్తున్నాయని గ్రామస్థులు వాపోతు న్నారు. వర్షాలు ఎక్కువగా కురవడంతో తటాకాన్ని తలపిస్తున్నాయని, దోమల బెడద ఎక్కువైందన్నారు. డ్రైనేజీ నిర్మాణం చేపట్టి ఇళ్ల మధ్య లోకి మురుగు రాకుండా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు.




Updated Date - 2021-06-18T04:56:11+05:30 IST