మార్మోగిన జై భారత్‌ నినాదాలు

ABN , First Publish Date - 2022-08-16T07:44:53+05:30 IST

జిల్లాకేంద్రంలో సోమవారం స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మార్మోగిన జై భారత్‌ నినాదాలు

దేశభక్తి చాటిన ప్రజలు

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 15 : జిల్లాకేంద్రంలో సోమవారం స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా జైభారత్‌ నినాదాలు మార్మోగాయి. అడుగడుగునా యువత, విద్యార్థులు దేశభక్తి చా టారు. జాతీయజెండా ఎగురవేసి సమరయోధుల త్యాగాలు స్మరించు కున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకు న్నాయి. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశ స్వాతంత్ర్యాన్ని వివరించే ప్రదర్శనలు నిర్వహించారు. గుస్సాడీనృత్యాలు, జానపద కళా రూపాలు ప్రదర్శించి మెప్పుపొందారు. 

జడ్పీ కార్యాలయంలో..

జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి పతాకా విష్కరణ చేసి వందనం సమర్పించారు. సమరయోధులను స్మరించుకు న్నారు. వారి త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, సీఈవో సుధీర్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

ప్రజాసంఘాల సంబరం..

జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడు కలు ఘనంగా నిర్వహించారు. పతాకావిష్కరణ చేశారు. డి.నూతన్‌ కుమార్‌, తిరుపతి, పోశెట్టి పాల్గొన్నారు.

మంత్రి నివాసంలో పతాకావిష్కరణ..

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నివాసంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వ హించి పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కే. విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, లైబ్రరీ చైర్మన్‌ రాజేందర్‌, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, రాంచందర్‌, భూషణ్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.

వేడుకలు నిర్వహించిన టీడీపీ..

తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. త్యాగధనుల ను స్మరించుకున్నారు. పార్టీ అధ్యక్షుడు సిరికొండ రమేష్‌, శ్రీకాంత్‌, మౌలా నా, గఫూర్‌, కిషన్‌ పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే నివాసంలో..

మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆయన నివాసంలో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులను స్మరించుకున్నారు. దేశం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్‌, నిర్మల్‌ టౌన్‌ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, అయ్యన్నగారి పోశెట్టి, మోహిన్‌, అజహర్‌, తదితర నాయకులు పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో..

టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ట్యాంక్‌ బండ్‌ వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం వద్ద పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అధికార ప్రతి నిధి ముడుసు సత్యనారాయణ, ఏ. ముత్తన్న, పట్టణ అధ్యక్షుడు పాల్గొ న్నారు.

జాతిపితకు నివాళులర్పించిన చైర్మన్‌..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ జి. ఈశ్వర్‌గాంధీ పార్కులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సమర వీరులను తలుచుకొని వారి త్యాగాలు కొనియాడారు. ఎం. రాజన్న పాల్గొన్నారు.

బీఎస్పీ ఆధ్వర్యంలో..

బహుజన సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరులకు అంజలి ఘటించారు. జాతి పునర్నిర్మాణానికి అంకితం కావాలని పిలుపునిచ్చారు. అధ్యక్షుడు జగన్‌మోహన్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు. 

పతాకావిష్కరణ చేసిన సీపీఐ..

భారత దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను సీపీఐ పార్టీ ఘనంగా నిర్వ హించింది. పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ చేశారు. అమరుల త్యాగాలు స్మరించుకున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని పిలు పునిచ్చారు. ఎస్‌. విలాస్‌, సాయి, జాదవ్‌ శంకర్‌, పద్మ కుమారి, అనంత్‌ రావు పాల్గొన్నారు. 

దేశభక్తి చాటిన ఏబీవీపీ...

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఏబీవీపీ విద్యార్థులు దేశభక్తి చాటా రు. వివేకానంద విగ్రహం ఎదుట పతాకాన్ని ఎగురవేశారు. విభాగ్‌ కన్వీ నర్‌ మనోజ్‌ మాట్లాడుతూ... యువత స్వాతంత్య్ర యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలకు భారత్‌ విశ్వగురువుగా నిలుస్తోందన్నారు. జిల్లా కన్వీనర్‌ శివకుమార్‌, శశి, అజయ్‌, జశ్వంత్‌ పాల్గొన్నారు. 

బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ..

ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాన్ని పురస్కరిం చుకొని బీజేవైఎం నిర్మల్‌లో బైక్‌ర్యాలీ నిర్వహించి యువతను ఉత్తేజ పరిచింది. అధ్యక్షుడు ఒడిసెల అర్జున్‌ నాయకత్వంలో జరిగిన ర్యాలీకి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, రావులరాంనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-16T07:44:53+05:30 IST