Abn logo
Sep 26 2021 @ 23:58PM

చెన్నై బీచలో ఇద్దరు తెనాలి యువకుల గల్లంతు

శైలేష్‌, ప్రణీత్‌

ఒకరి మృతదేహం లభ్యం, మరొకరి కోసం గాలింపు

తెనాలి రూరల్‌, సెప్టెంబరు 26: చైన్నై బీచ్‌లో తెనాలికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి ఐతానగర్‌కు చెందిన బొడ్డు శైలేష్‌ (18) చైన్నైలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో 20రోజుల క్రితం చేరారు. శైలేష్‌కు కొత్త సెల్‌ఫోన్‌ ఇవ్వడానికి వెళ్లిన అతని అన్న ప్రకాష్‌, బాబాయి కొడుకు ప్రణీత్‌ (17)మూడు రోజుల క్రితం అక్కడకు వెళ్లారు, వీరు ముగ్గురు కలిసి చెన్నై బీచ్‌కు శుక్రవారం వెళ్లారు. శైలేష్‌, ప్రణీత్‌ బీచ్‌లోకి దిగగా ప్రకాష్‌ ఒడ్డునుండి ఫోన్‌ మాట్లాడుతున్నారు. కొద్దిసేపటికి శైలేష్‌, ప్రణీత్‌లు కనపడకపోవడంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆదివారం తెల్లవారుజామున శైలేష్‌ మృతదేహం లభించింది. ప్రణీత్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బంధువులు తెలిపారు.