షార్జా: ఐపీఎల్ 2021లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సునాయాసంగా విజయం సాధించింది. 157 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(38: 26 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్స్), ఫాఫ్ డూ ప్లెసిస్(31: 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి ఓపెనింగ్ ఇచ్చారు. అయితే వరుస ఓవర్లలో గైక్వాడ్‌ను చాహల్ అవుట్ చేయగా.. డూ ప్లెసిస్‌ను మ్యాక్స్‌వెల్ పెవిలియన్ పంపాడు. కానీ ఆ తర్వాత క్రీజులోకొచ్చిన మోయీన్ అలీ(23: 18 బంతుల్లో 2 సిక్స్‌లు), అంబటి రాయుడు(32: 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి జట్టును విజయం వైపు తీసుకెళ్లారు. చివర్లో సురేశ్ రైనా(17 నాటౌట్: 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), ఎంఎస్ ధోనీ(11 నాటౌట్: 9 బంతుల్లో 2 ఫోర్లు) లాంఛనంగా విజయాన్ని అందించారు. 18.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. కాగా.. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు తీయగా, యుజ్వేంద్ర చాహల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చెన్నై ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 3/24కు దక్కింది.