ఎన్టీఆర్‌ వర్సిటీ పేరు మార్పు తెలుగుజాతిని అవమానించినట్లే

ABN , First Publish Date - 2022-09-22T04:21:28+05:30 IST

విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు తొలగించటం తెలుగు జాతిని అవమానించినట్లేనని టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ము క్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.

ఎన్టీఆర్‌ వర్సిటీ పేరు మార్పు తెలుగుజాతిని అవమానించినట్లే
ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకంలో టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఉగ్ర

ఈ చేష్టలు తుగ్లక్‌ పాలనకు నిదర్శనం

మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి


కనిగిరి, సెప్టెంబరు 21 : విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు తొలగించటం తెలుగు జాతిని అవమానించినట్లేనని టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ము క్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక పా మూరురోడ్డులోని అమరావతి గ్రౌండ్స్‌లో బు ధవారం జరిగిన సమావేశంలో సీఎం జగన్‌ తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. తెలుగు ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే మహనీయుడు ఎన్టీఆర్‌ పేరు మార్పు వెనుక సీఎం జగన్‌రెడ్డి కుట్ర దాగి ఉందన్నారు. అమరావతి ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రజాదరణ చూసి ప్రజల్ని ఆ వైపు నుంచి మరల్చేందుకు సీఎం జగన్‌రెడ్డి ఎన్టీఆర్‌ వర్సిటీ పే రు మార్పు చేశాడని విమర్శించారు. దేశంలో తెలుగుజాతి, ఖ్యాతిని దశదిశలా చాటి, ఢిల్లీ వీధుల్లో తెలుగోడి పౌరుషాన్ని, తెగువను చూపించిన గొప్ప వ్యక్తి పేరును మార్చాలని ఆలోచన రావటం జగన్‌రెడ్డి తుగ్లక్‌ పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. దేశ, విదేశాల్లో ఇప్పటికే ఎన్టీఆర్‌ వ ర్సిటీ పేరు నమోదై ఎంతో గొప్ప పేరును, విద్యావంతుల ను తయారు చేసిన ఘనత సొంతం చేసుకుందని విమ ర్శించారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేయలేదని ధ్వజమెత్తారు. పేరు మార్పు నిర్ణయం విరమించుకోకపోతే తెలుగు ప్రజ ల ఆగ్రహాన్ని జగన్‌రెడ్డి చవిచూడక తప్పదని హెచ్చరించా రు. ఈ సమావేశంలో నాయకులు వీవీఆర్‌మనోహరరావు, భేరి పుల్లారెడ్డి, రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, ముచ్చుమూరి చెంచిరెడ్డి, నంబుల వెంకటేశ్వర్లుయాదవ్‌, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి, గాయం తిరుపతిరెడ్డి, కోటపాటి శేషయ్య, తెలుగు మహిళలు కరణం అరుణ, వాజిదాబేగంలు పాలొన్నారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి  పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Updated Date - 2022-09-22T04:21:28+05:30 IST