అభివృద్ధి కోసం అంటూ పార్టీ మారడం ఓ ఫ్యాషన్‌ అయింది

ABN , First Publish Date - 2022-08-20T10:19:51+05:30 IST

బీజేపీతో ఏం అభివృద్ధి జరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే ఆ పార్టీలోకి వెళ్తున్నారని వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

అభివృద్ధి కోసం అంటూ పార్టీ మారడం ఓ ఫ్యాషన్‌ అయింది

బీజేపీ ఏం అభివృద్ధి చేసిందని ఆ పార్టీకి వెళ్తున్నారు: షర్మిల


మహబూబ్‌నగర్‌/మక్తల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): బీజేపీతో ఏం అభివృద్ధి జరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే ఆ పార్టీలోకి వెళ్తున్నారని వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. ‘బీజేపీ ఎంపీ ఒకరు పసుపు బోర్డు తెస్తానని ఓట్లేయించుకొన్నారు. మరి తెచ్చారా? పసుపు బోర్డే ఇవ్వని బీజేపీ వల్ల ఏం అభివృద్ధి జరుగుతుంది’ అని నిలదీశారు. కాంట్రాక్టుల కోసం, డబ్బుల కోసం పార్టీల మారుతున్నారని ఆరోపించారు. ‘అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాం అని చెప్పడం ఓ ఫ్యాషన్‌ అయింది’ అని విమర్శించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఆమె నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గంలో పర్యటించారు. మక్తల్‌ పట్టణంలో బహిరంగ సభలో మాట్లాడారు. మునుగోడులో ఒక సర్పంచ్‌ను కొనేందుకు కార్లు గి ఫ్టుగా ఇస్తున్నారని, సిగ్గుపడాలని అన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రజల సం క్షేమాన్ని విస్మరించినందునే తాను పార్టీ ఏర్పాటు చేశానని, తనను ఆశీర్వదిస్తే వైఎ్‌సఆర్‌ లాంటి సంక్షేమ పాలన తీసుకువస్తానని షర్మిల అన్నారు. 

Updated Date - 2022-08-20T10:19:51+05:30 IST