ప్రైవసీ సెట్టింగ్స్‌లో మార్పులు

ABN , First Publish Date - 2022-06-18T09:29:09+05:30 IST

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో ఉండటం ఒక ఎత్తయితే, ఇందులో పర్సనల్‌ సమాచారాన్ని ప్రొటెక్ట్‌ చేసుకోవడం మరొక ఎత్తు.

ప్రైవసీ సెట్టింగ్స్‌లో మార్పులు

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో ఉండటం ఒక ఎత్తయితే, ఇందులో పర్సనల్‌ సమాచారాన్ని ప్రొటెక్ట్‌ చేసుకోవడం మరొక ఎత్తు. ఇలాంటి సందర్భాల్లో నిరంతరంగా ప్రైవసీ చెకప్‌ చేసుకోవడం బెస్ట్‌ ఆప్షన్‌. ఫేస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు అలా చేస్తే ఏయే యాప్స్‌కు మీ డేటా యాక్సెస్‌ ఉందో తేలుస్తుంది. నిజానికి మీ ప్రైవసీ సెట్టింగ్స్‌ను ఎప్పటికప్పుడు వీక్షించడమే కాదు, అవసరానుగుణంగా సెట్‌ చేసుకోవచ్చు. అందుకోసం ఏమి చేయాలంటే...

ఫేస్‌బుక్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, అకౌంట్‌లోకి వెళ్ళాలి.

స్ర్కీన్‌ రైట్‌ కార్నర్‌లో త్రీ హారిజాంటల్‌ లైన్‌ మెనూని సెలెక్ట్‌ చేయాలి.

సెట్టింగ్స్‌ అండ్‌ ప్రైవసీని సెలెక్ట్‌ చేయాలి. 

డ్రాప్‌-డౌన్‌ మెనూ నుంచి సెట్టింగ్స్‌ను సెలెక్ట్‌ చేయాలి. 

ముఖ్యమైన ప్రైవసీ సెట్టింగ్స్‌ను కనుగొనేందుకు టాప్‌ చేసి, ప్రైవసీ చెక్‌పను కంప్లీట్‌ చేయాలి. 

ఇవి కూడా రెవ్యూ చేయొచ్చు

ఫీడ్‌ ప్రిఫరెన్సెస్‌ని అప్‌డేట్‌ చేయడం ద్వారా కేర్‌ తీసుకోవాల్సిన కంటెంట్‌  ఏమిటి అన్నది చూడొచ్చు. 

యాడ్‌  ప్రిఫరెన్సెస్‌ని కస్టమైజ్‌ చేస్తే సంబంధిత ప్రకటనలను చూడొచ్చు. ఇక్కడ ప్రిఫరెన్స్‌లను మార్చుకోవచ్చు. ఫేస్‌బుక్‌ కాకుండా ఇతర యాప్స్‌, వెబ్‌సైట్స్‌ వినియోగాన్ని ఆధారంగా చేసుకుని సదరు ప్రకటనలు చూపవచ్చా, వద్దా అన్నది తేల్చుకోవచ్చు. 

ఆసక్తి లేకపోవచ్చు, ఉపయోగం లేకపోవచ్చు... విషయం ఏదైనప్పటికీ రెవ్యూ లేదంటే హైడ్‌ చేయవచ్చు. 

ఫేస్‌బుక్‌ డేటాను చూడవచ్చు, మేనేజ్‌ చేసుకోవచ్చు లేదంటే అనాల్సిస్‌ కోసం డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

మేనేజ్‌మెంట్‌ యాక్టివిటీకి సంబంధించి ఫేస్‌బుక్‌ నుంచి షేర్‌ చేసిన కంటెంట్‌ను మేనేజ్‌ చేయవచ్చు.

Updated Date - 2022-06-18T09:29:09+05:30 IST