Abn logo
Mar 6 2021 @ 23:18PM

వ్యవసాయ విద్యుత్‌ వేళల్లో మార్పులు

ఒంటిమిట్ట, మార్చి6 : మండలంలోని రైతులకు వ్యవసాయ విద్యు త్‌వేళల్లో మార్పులు చేపట్టినట్లు విద్యుత్‌ ఏడీ వెంకటేశ్వర్లు తెలిపారు. దర్జీపల్లె, ఇబ్రహీం పేట, గంగపేరూరు, చెర్లోపల్లె, మలకాటిపల్లె, చింతరాజు పల్లె ఫీడర్లలోని గ్రామాల్లో రైతులకు ఉదయం 6 నుంచి 3 గంటల వరకు ఉంటుందన్నారు.రాచపల్లె, చెంచుగారిపల్లె, మాధవరం రూరల్‌, సీతాపురం, అచ్చంపేట, మంటపంపల్లె ఫీడర్లలో వ్యవసాయ  రైతులకు 9గంటల నుంచి 6 వరకు విద్యుత్‌ సరఫరా ఉంటుందన్నారు. ఈ మార్పులు 8వ తేదీ సోమవారం నుంచి అమలవుతుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement