Abn logo
Nov 23 2020 @ 10:46AM

`ఛత్రపతి`కి మార్పులు చేస్తున్నారా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ సినిమా `ఛత్రపతి` త్వరలో బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతోంది. డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీలో అభిమానులను సంపాదించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు. 


వీవీ వినాయక్ లేదా `సాహో` ఫేం సుజిత్ ఈ సినిమాను రూపొందించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ హిందీ వెర్షన్‌ కోసం కొన్ని మార్పులు చేస్తున్నారట. మాతృకకు కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ పనిలో బిజీగా ఉన్నారట. హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సెకెండాఫ్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారట. బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement