చీకటి రాష్ట్రంగా మార్చారు: బీసీ

ABN , First Publish Date - 2021-10-18T04:14:51+05:30 IST

ఏపీని చీకటి ఆంధ్రప్రదేశగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్ది విమర్శించారు.

చీకటి రాష్ట్రంగా మార్చారు: బీసీ
మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన రెడ్డి

బనగానపల్లె, అక్టోబరు 17: ఏపీని చీకటి ఆంధ్రప్రదేశగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్ది విమర్శించారు. బనగానపల్లె మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన పీవి.కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన కొత్తపేట వెంకటసుబ్బారెడ్డి, ఇతర కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో నూతన మండల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. బీసీ మాట్లాడుతూ సీఎం జగన  సౌర, పవనవిద్యుత పీపీఏలను రద్దు చేయడం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.2,542 కోట్ల రూపాయలు భారం పడిందన్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నా రైతుల పంప్‌సెట్లకు మోటార్లు బిగిస్తున్నారన్నారు. ఇది రైతులకు ఉరితాడు బిగించడమే అని విమర్శించారు. గ్రామాల్లో విద్యుత కోతలు ప్రారంభమయ్యాయన్నారు. పెరిగిన విద్యుత చార్జీల పెంపు వల్ల సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఎన్నికల ముందు విద్యుత చార్జీలను పెంచమని చెప్పిన ముఖ్యమంత్రి జగన నేడు విద్యుత చార్జీలు పెంచడం అన్యాయమన్నారు. టీడీపీ మండల ఉపాధ్యక్షుడు జహంగీర్‌బాషా, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఉమామహేశ్వరరావు, బాలనాయుడు, శంఖేశ్వరరెడ్డి, మండల కార్యదర్శులు మదనభూపాల్‌రెడ్డి, తిరుపాల్‌ నాయక్‌, మధుశేఖర్‌, కోశాధికారి ఖాదర్‌బాషా, ఖాదర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-18T04:14:51+05:30 IST