రింగ్‌రోడ్డును మార్చండి : బాధితుల సంఘం

ABN , First Publish Date - 2021-07-31T05:56:10+05:30 IST

నిజామాబాద్‌ నగర మాస్టర్‌ ప్లాన్‌ లోని రింగ్‌రోడ్డును మార్చాలని రింగురోడ్డు బాధితుల కమిటీ కలెక్టర్‌ నారా యణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా కన్వీనర్‌ రామ్మోహనరావు మాట్లాడుతూ మాస్టర్‌ ప్లాన్‌లో వినాయకనరగ్‌ నుంచి గాయత్రినగర్‌, వివేకానందనగర్‌,

రింగ్‌రోడ్డును మార్చండి : బాధితుల సంఘం
కలెక్టర్‌కు వినతిప్రతం అందజేస్తున్న బాధితుల కమిటీ ప్రతినిధులు

నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 30: నిజామాబాద్‌ నగర మాస్టర్‌ ప్లాన్‌ లోని రింగ్‌రోడ్డును మార్చాలని రింగురోడ్డు బాధితుల కమిటీ కలెక్టర్‌ నారా యణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా కన్వీనర్‌ రామ్మోహనరావు మాట్లాడుతూ మాస్టర్‌ ప్లాన్‌లో వినాయకనరగ్‌ నుంచి గాయత్రినగర్‌, వివేకానందనగర్‌, ఆనందర్‌నగర్‌ మీదుగా వర్ని రోడ్డు వరకు ప్రతిపాదించిన రోడ్డును మార్చాలని, లేదంటే వందలాది మంది రోడ్డున పడతారని పేర్కొన్నారు. 50ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఎంతో మంది పేద, మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు కొనుక్కొని ఇళ్లు నిర్మించుకున్నా రని తెలిపారు. ఇళ్లకు పర్మిషన్‌ ఇచ్చి, ఇప్పుడు రోడ్డు వేస్తామనడం భావ్యం కాదని పేర్కొన్నారు. ప్రతిపాదిత రోడ్డు ప్రాంతంలో లేఅవుట్లు వేసి అమ్ము తుంటే అధికారులు చోద్యం చూశారన్నారు. పేదలు పైసాపైసా కూడబెట్టి అక్కడ స్థలాలు కొనుగోలు చేశారని తెలిపారు. ప్రతిపాదిత రోడ్డులో వర్ని రోడ్డు నుంచి బోధన్‌ రోడ్డు వరకూ ఉన్న ప్రాంతాన్ని తొలగించిన అధికారు లు, దీనిని రింగురోడ్డుగా పేర్కొనటంలో అర్థం లేదని తెలిపారు. సామాన్య ప్రజలను కాదని, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల కనుసన్నల్లో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారని ఆయన ఆరోపించారు. నగర పరిధిలోని చంద్రశేఖర్‌ నగర్‌ రోడ్డును 30అడుగుల నుంచి 60 అడుగులకు పెంచారని, ఈ ప్రాంతంలో పర్మిషన్లు తీసుకొని ఇళ్లు నిర్మించుకున్నవారంతా ఏం కావాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టు కొని మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో కో కన్వీ నర్‌ గోదావరి, రాములు, రాధాకృష్ణ, రాజు, పుండరి, తదితరులున్నారు.

Updated Date - 2021-07-31T05:56:10+05:30 IST