వ్యూహం మార్చితేనే..!

ABN , First Publish Date - 2021-04-07T09:58:21+05:30 IST

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ క్రేజే వేరు..ధోనీ కెప్టెన్సీలో ఆ జట్టు మూడుసార్లు చాంపియన్‌గా ఐదుసార్లు రన్నర్‌పగా నిలిచింది. ఒకసారి సెమీ్‌సకు మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరిందంటే ఆ జట్టు సత్తా అర్థమవుతుంది. టోర్నీలో ఇంత ఘనమైన చరిత్ర కలిగిన సీఎ్‌సకే కిందటిసారి లీగ్‌ దశలోనే వెనుదిరిగి ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ మిగిల్చింది. అందుకుగల కారణాలను అన్వేషించి వ్యూహాలను మార్చుకుంటేనే ఆ జట్టు పూర్వవైభవం సంతరించుకుంటుంది...

వ్యూహం మార్చితేనే..!

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ క్రేజే వేరు..ధోనీ కెప్టెన్సీలో ఆ జట్టు మూడుసార్లు చాంపియన్‌గా ఐదుసార్లు రన్నర్‌పగా నిలిచింది. ఒకసారి సెమీ్‌సకు మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరిందంటే ఆ జట్టు సత్తా అర్థమవుతుంది. టోర్నీలో ఇంత ఘనమైన చరిత్ర కలిగిన సీఎ్‌సకే కిందటిసారి లీగ్‌ దశలోనే వెనుదిరిగి ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ మిగిల్చింది. అందుకుగల కారణాలను అన్వేషించి వ్యూహాలను మార్చుకుంటేనే ఆ జట్టు పూర్వవైభవం సంతరించుకుంటుంది. 


(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా పునరాగమనం చెన్నైలో ఉత్సాహం నింపింది. వ్యక్తిగత కారణాలతో గత ఐపీఎల్‌కు అతడు దూరంగా ఉండడం ధోనీ సేనపై చూపిన ప్రభావం అంతాఇంతా కాదు. ముఖ్యంగా మిడిలార్డర్‌లో ధాటిగా పరుగులు చేసే బ్యాట్స్‌మన్‌లేక చతికలపడింది. అలాగే కొన్ని ఉపయుక్తమైన ఓవర్లు వేసే బౌలర్‌లేక డీలా పడింది. రైనా రాకతో ఈ రెండు సమస్యలు దాదాపు పరిష్కారమైనట్టే. ఇకపోతే ధోనీ, డుప్లెసి, అంబటి రాయుడు, జడేజాలాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో ఆ జట్టు బ్యాటింగ్‌ పటిష్ఠంగా ఉంది. ఆల్‌రౌండర్‌ శామ్‌ కర్రాన్‌, కొత్తగా జట్టులోకొచ్చిన మొయిన్‌ అలీ, యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా అడ్డుకొని  పరుగులు సాధించగలిగిన సత్తా కలిగిన వారే. కృష్ణప్ప గౌతమ్‌ కూడా అవసరమైతే బ్యాట్‌ ఝళిపించగలడు. లుంగి ఎంగిడి, శార్దూల్‌ ఠాకూర్‌, కర్రాన్‌, దీపక్‌ చాహర్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టగల పేస్‌ బౌలింగ్‌ విభాగం చెన్నై సొంతం. ఇమ్రాన్‌ తాహిర్‌, మొయిన్‌ అలీ స్పిన్‌ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  


ఆదిలోనే ఎదురు దెబ్బ: వ్యక్తిగత కారణాలతో ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ హాజెల్‌వుడ్‌ వైదొలగడం చెన్నైకు గట్టి ఎదురు దెబ్బగా చెప్పాలి. అంతేకాకుండా వయస్సు మీరిన క్రికెటర్లు ఎక్కువగా ఉండడం కూడా సీఎ్‌సకేకి ఒకింత ప్రతికూలమే. ధోనీ, రైనా, తాహిర్‌, రాయుడు చాలినంత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండానే టోర్నీలోకి అడుగుపెడుతున్నారు. జడేజా గాయంతో సుదీర్ఘకాలం ఆటకు దూరంగా ఉండి ఐపీఎల్‌తోనే ఆటలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ బ్రావోలో గత మెరుపులు కరువయ్యాయి. చెన్నై బలమంతా ఆ జట్టు స్పిన్‌ విభాగమే. కానీ ఈసారి జట్టు ఆడుతున్న వాంఖడే స్టేడియం పిచ్‌ పేసర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. ఈనేపథ్యంలో ఆ జట్టు తన వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్‌లో ప్రమాదకర ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై తలపడనుంది. అంటే..మొదటి మ్యాచ్‌లోనే ఆ జట్టుకు గట్టి సవాలు ఎదురు కానుంది. దాంతో ఆరంభంనుంచే ధోనీ సేన విజృంభించాల్సిందే. 


జట్టు

ధోనీ (కెప్టెన్‌), సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, డుప్లెసి, జడేజా, ఇమ్రాన్‌ తాహిర్‌, ఎంగిడి, దీపక్‌ చాహర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, బ్రావో, శార్దూల్‌, సామ్‌ కర్రాన్‌, ఎన్‌.జగదీశన్‌, కేఎం ఆసిఫ్‌, కర్ణ్‌ శర్మ, శాంట్నర్‌, మొయిన్‌ అలీ, కె.గౌతమ్‌, పుజార, సాయి కిశోర్‌, హరిశంకర్‌ రెడ్డి, భగవత్‌ వర్మ, హరినిశాంత్‌.






చెన్నై ఎవరితో ఎప్పుడు?



Updated Date - 2021-04-07T09:58:21+05:30 IST