Abn logo
Jan 26 2021 @ 00:21AM

3 రోజులకే కమిషనర్‌ మార్పు


చింతలపూడి, జనవరి 25: చింతలపూడి నగర పంచాయతీకి కమిష నర్‌గా సృజన బాధ్యతలు స్వీకరించిన మూడు రోజులు గడవక ముందే కొత్త కమిషనర్‌ను నియ మించారు. నల్లా రాంబాబు సోమవారం కార్యాలయం లో తనను ఇన్‌ఛార్జి కమిషనర్‌గా నియమించారంటూ ఉత్త ర్వులతో వచ్చారు. సాయంత్రం సృజన నుంచి బాధ్యతలు స్వీకరించారు. పాలకొల్లు మున్సిపాల్టీలో గ్రేడ్‌ –1 మేనేజర్‌గా పనిచేస్తున్న రాంబాబును చింతలపూడి నగర పంచాయతీ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా నియమించ డంతో ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రజల సమస్యల పరిష్కరిస్తానని అందరూ సహకరించాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు.


Advertisement
Advertisement
Advertisement