‘కార్మిక చట్టాల మార్పును రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2020-06-07T11:19:26+05:30 IST

కేంద్ర ప్రభు త్వ కార్మిక చట్టాల మార్పును రద్దు చేయాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మ జ్దూర్‌ యూనియన్‌ స్థానిక బ్రాంచ్‌ సె క్రటరీ విశ్వనాథ్‌ డిమాండ్‌ చేశారు.

‘కార్మిక చట్టాల మార్పును రద్దు చేయాలి’

నందలూరు, జూన్‌ 6 : కేంద్ర ప్రభు త్వ కార్మిక చట్టాల మార్పును రద్దు చేయాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మ జ్దూర్‌ యూనియన్‌ స్థానిక బ్రాంచ్‌ సె క్రటరీ విశ్వనాథ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆల్‌ ఇండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ పిలుపు మేరకు కార్మిక వ్య తిరేక విధానాలపై నిరసన తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పనిగంటలు పెంచవద్దని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, రైల్వేలో ప్రైవేటీకరణను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ ఉ ద్యోగులు, పెన్షనర్లకు నిలిపివేసిన కరువుభత్యాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.  అసిస్టెంట్‌ సెక్రటరీలు ఎస్‌.ఎం.బాషా, ఎస్‌ఏఎండీ గౌస్‌, వైస్‌ చైర్మన్‌ నరసింహులు, కార్మికులు నాగరాజు, ప్రశాంత్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-07T11:19:26+05:30 IST